ఆర్మీ రిక్రూట్ మెంట్ లో మరో అపశ్రుతి | army recruitment rally in vishakapatnam | Sakshi
Sakshi News home page

ఆర్మీ రిక్రూట్ మెంట్ లో మరో అపశ్రుతి

Published Thu, Jul 9 2015 1:48 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

army recruitment rally in vishakapatnam

విశాఖపట్టణం: విశాఖలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. గురువారం ర్యాలీ లో పాల్గొన్న తోబుల్ రెడ్డి అనే అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతనిని స్థానిక కేజీహెచ్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న తోబుల్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతనిని కేజీహెచ్ నుంచి ఓ ప్రయివేటు హాస్పిటల్ కు తరలించారు.

కాగా బుధవారం జరిగిన రిక్రూట్ మెంటు ర్యాలీలో పొల్గొన్న నీలబాబు అనే అభ్యర్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆర్మీ పరుగుపందెంలో పొల్గొని ప్రథమ స్థానంలో నిలిచిన నీలబాబు రేసు పూర్తయిన తర్వాత సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే కేజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement