బస్సులు లేక భక్తులు ఇబ్బందులు
ఆర్టీసీ అధికారులకు ఆదాయంపై ఉన్న శ్రద్ద్ధ..ప్రయాణికులపై లేదు.
కర్నూలు సిటీ: ఆర్టీసీ అధికారులకు ఆదాయంపై ఉన్న శ్రద్ద్ధ..ప్రయాణికులపై లేదు. శ్రీశైలం బ్రహో్మత్సవాలకు గత రెండు రోజులుగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అదనంగా కాకుండా స్పెషల్ బస్సుల పేరుతో భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తోంది. మాఘమాసం చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున శ్రీశైలానికి వచ్చిన భక్తులు తిరిగి ఊర్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంటే అక్కడ ఉదయం 8 గంటల నుంచి బస్సులే లేవు. దీంతో చాలా మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర గంటకు ఓ బస్సు ఉందంటూ ప్రచారం చేసి ఏర్పాటు చేయకపోతే ఎలా అని ఆర్టీసీ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.