డిసెంబర్ 10 నుంచి రైల్వేతో పాటు మెట్రో, సబర్బన్ టికెట్ కౌంటర్లు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు, కౌంటర్లలో పాత 500 నోట్లను
న్యూఢిల్లీ: డిసెంబర్ 10 నుంచి రైల్వేతో పాటు మెట్రో, సబర్బన్ టికెట్ కౌంటర్లు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు, కౌంటర్లలో పాత 500 నోట్లను అంగీకరించరని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. డిసెంబర్ 15 వరకూ పాత 500 నోట్లు తీసుకునేందుకు సమయమున్నా... మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే రైలు ప్రయాణం సమయంలో కేటరింగ్ సేవలకు మాత్రం ఈ నిబంధన వర్తించదని పేర్కొంది.