ఆటోను తప్పించబోయి రెండు బస్సులు ఢీకొన్న వైనం
ఇద్దరు బస్సు డ్రైవర్లు దుర్మరణం
24 మందికి తీవ్ర గాయాలు
16 వుందికి స్వల్ప గాయూలు
ఇద్దరి పరిస్థితి విషమం
అడ్డంగా వచ్చిన ఆటోను తప్పించాలని ఆ డ్రైవర్లు భావించారు. ఈ ప్రయత్నంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ప్రయాణికులను కాపాడగలిగిన ఆ ఇద్దరు డ్రైవర్లు తమ ప్రాణాలను మాత్రం పణంగా పెట్టారు. మృత్యుఒడికి చేరిపోయారు. ఈ దుర్ఘటనలో 24 మంది తీవ్రంగా, 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
శ్రీకాళహస్తి: ఏర్పేడు వుండలంలోని మేర్లపాక సమీపంలో నాయుడుపేట-పుతలపట్టు రహదారిలో సోవువారం ఇద్దరు మృతిచెందిన ప్ర మాద సంఘటన వివరాలివి. ఏర్పేడు నుంచి శ్రీకాళహస్తికి ప్రయాణికులను తరలించే ఒక ఆటో మేర్లపాక సమీపంలో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుని రోడ్డుపైకి వచ్చింది. ఇదే సమయంలో తిరుపతినుంచి శ్రీకాళహస్తి కి వెళుతున్న ఆర్టీసీ బస్సుడ్రైవరు, శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవరు ఆటోను తప్పించాలని భావించారు. ఈ క్రమంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నారుు. ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బస్సుల వుుందుభాగం దెబ్బతింది. డ్రైవర్లను ఆస్పత్రికి తరలించడానికి స్థానికులు ప్రయత్నించారు.
బస్సుల్లో ఇరుక్కుపోవడంతో బయుటకు తీయుడానికి 20 నిమిషాలు పట్టింది. ఈ క్రమంలో డ్రైవర్లు అంజూరుకు చెందిన అంజురు శ్రీనివాసులు(45), పరమాలపల్లికి చెందిన బాపన సాంబయ్యు (34) వుృతి చెందారు. రెండు బస్సుల్లోని 80 మంది ప్రయాణికుల్లో 24 వుంది తీవ్రంగాను, 16 వుంది స్వల్వంగా గాయుపడ్డారు. తీవ్రంగా గాయుపడిన వుస్తాన్(32), రమేష్(23), హైవూవతి(23), శివకువూర్(23), వుునిశేఖర్(43), వెంకటేష్(23), గోవర్ధన్(22), శాంతవ్ము(34), శివారెడ్డి(35), వుస్తాన్(33) తదితరులను శ్రీకాళహస్తి, ఏర్పేడు 108 వాహనాలు, రెండు అంబులెన్స్‌ల సహాయుంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీజ(32), భారతి(23) పరిస్థితి విషవుంగా ఉండడంతో తిరుపతి రూయూ ఆస్పత్రికి తరలించారు. వురోవైపు బస్సులను వెనుకవైపు నుంచి రెండు సూమోలు ఢీకొన్నాయి. దీంతో చిన్నస్వామి,(45), శ్రీనివాసులు(34) తీవ్రంగా గాయుపడ్డారు. వారికి చికిత్స చేస్తున్నారు. ఇక రోడ్డు ప్రవూదంలో ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సవూచారం అందుకున్న ఏర్పేడు ఎస్‌ఐ రావుకృష్ణ తవు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల సహాయుంతో రోడ్డుపై ఉన్న బస్సులను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను నియుంత్రించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్డీసీ బస్సులు ఆటోను ఢీకొని ఉంటే పది వుందికి పైగా మృతి చెంది ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. వారి ప్రాణాలు కాపాడడం కోసం డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారని, అంతేకాకుండా 80 వుంది ప్రయూణికుల ప్రాణాలు కాపాడారని ప్రయాణికులు చర్చించుకున్నారు.
ప్రయాణికులను కాపాడి.. ప్రాణాలు కోల్పోయి...
Published Tue, Nov 24 2015 2:11 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement