![TSRTC: City Buses To Soon Get Colour Makeover - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/20/Untitled-4.jpg.webp?itok=FUF39cDv)
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఆకర్షణీ యంగా రూపుదిద్దుకుంటోంది. కొత్త హంగులు, రంగులతో ప్రయాణికుల ముందుకు రానుంది. ఆర్టీసీ బస్సు ఏళ్లుగా ఒకే రకంగా ఉంటోంది. కర్ణాటక, మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు తెలంగాణ బస్సుల కంటే భిన్నం గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కూడా మార్పులు, చేర్పులు చేయాలని సంస్థ నిర్ణయించింది.
ఎలా ఉండాలో చెప్పండి: ఎండీ
గతంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని ఆ మేరకు బస్సుల రంగులు, ఇత రాల్లో మార్పులు చేసేవారు. కానీ, ఇప్పుడు డిపోస్థాయి నుంచి సిబ్బంది ఎవరైనా సరే ఈ విషయంలో సలహాలు ఇవ్వాలని ఎండీ ఆహ్వానించారు. ఈ మేరకు డిపోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. బస్సుల ఆకృతి, సీట్లు ఎలా ఉండాలి, ఫుట్ రెస్టు ఏర్పాటులో మార్పు అవసరమా, డోర్లు ముందుండాలా, వెనక ఉండాలా, మధ్యలో ఉండాలా, ఏసీ వ్యవస్థలో మార్పులు కావాలా, రంగుల్లో ఎలాంటి మార్పులుండాలి, ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారు, వారి నుంచి తరచూ వస్తున్న ఫిర్యాదులేంటి? ఏయే మార్పులు చేయాలి? ఇలా చాలా అంశాల్లో సలహాలను అడిగారు.
సిబ్బంది సూచనల ఆధారంగా మార్పుచేర్పులు చేయబోతున్నారు. దాదాపు 550 కొత్త బస్సులను త్వరలో కొనబో తున్నారు. సాధారణంగా ఆర్టీసీ ఛాసీస్‌లను మాత్రమే కొంటుంది. వాటి బస్‌బాడీ మియాపూర్ బస్‌బాడీ యూనిట్లో రూపొం దించుకుంటుంది. ఏసీ బస్సులు మాత్రం బాడీతోసహా అన్నీ కంపెనీ నుంచే వస్తాయి. ఇప్పుడు సిబ్బంది ఇచ్చే సూచనల ఆధా రంగా ఈ కొత్త బస్సుల కొనుగోలు నుంచే మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు గూగుల్ మీట్ ద్వారా మంగళవారం ఉన్నతాధికారులు డిపో మేనేజర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment