తాడిపత్రి మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ పరిధిలో రెండ్రోజులుగా దాడులు నిర్వహించి పర్మిట్ లేని రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలను సీజ్ చేసినట్లు ఎంవీఐ కరుణసాగర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.
తాడిపత్రి టౌన్ : తాడిపత్రి మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ పరిధిలో రెండ్రోజులుగా దాడులు నిర్వహించి పర్మిట్ లేని రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలను సీజ్ చేసినట్లు ఎంవీఐ కరుణసాగర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. గుత్తి నుంచి బెంగళూరుకు వెళ్తున్న రెండు ప్రైవేటు బస్సులు పర్మిట్ చెల్లించని కారణంగా సీజ్ చేశామన్నారు. వాటికి రూ.2.5 లక్షలు జరిమానా విధించామన్నారు. తాడిపత్రి పాతబ్రిడ్జి వద్ద అధికలోడ్‌తో వెళ్తుండగా రెండు లారీలు పట్టుకుని రూ.35 వేలు, ఒక ట్రాక్టర్, రెండు ఆటోలకు రూ.15 వేలు జరిమానా విధించామని వివరించారు.