కొరడా ఝుళిపించిన రవాణా శాఖ
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, నాగార్జునసాగర్ , ముంబై రూట్లలో తిరుగుతున్న బస్సులపై 156 కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పన్ను ఎగవేత, వాణిజ్య సరుకులను తీసుకెళ్లడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, ప్రాథమిక చికిత్స బాక్స్ లేకపోవడం, అత్యవసర ద్వారం లేకపోవడం వంటివి ఈ దాడుల్లో బయటపడ్డాయి. కొన్ని బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు.
ప్రైవేటు బస్సుల పై దాడులు
Published Thu, Dec 24 2015 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM
Advertisement
Advertisement