రెండు పుష్కరాలకు ప్రత్యేక బస్సులు | special buses to pushkaralu | Sakshi
Sakshi News home page

రెండు పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

Published Sun, Jul 31 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

special buses to pushkaralu

గోదావరి అంత్య పుష్కరాలు, త్వరలో ప్రారంభమయ్యే కష్ణా పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను తిప్పుతుందని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎం జాన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ..

  • ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎం జాన్‌రెడ్డి
  • ఖమ్మం మామిళ్లగూడెం: గోదావరి అంత్య పుష్కరాలు, త్వరలో ప్రారంభమయ్యే కష్ణా పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను తిప్పుతుందని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎం జాన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న గోదావరి అంత్య పుష్కరాల కోసం ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, మధిర, సత్తుపల్లి డిపోలతో పాటు ఇల్లెందు నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని వివరించారు. ఈ నెల 11వ తేదీ వరకు సర్వీసులు తిరుగుతాయని, రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని చెప్పారు. 12వ తేదీ నుంచి 23 వరకు ఏపీలో కొనసాగే..కష్ణా పుష్కరాలకు జిల్లా నుంచి విజయవాడ, వేదాద్రి, మట్టపల్లికి 60 బస్సులు తిప్పుతామన్నారు. మధిర నుంచి విజయవాడ, వైరా నుంచి వేదాద్రికి 25బస్సులు, సత్తుపలి ్లనుంచి విజయవాడకు 40, కొత్తగూడెం – విజయవాడ, వేదాద్రికి 35బస్సులు, మణు గూరునుండి–విజయవాడకు 25, భద్రాచలం –విజయవాడ, వేదాద్రికి 40 ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు. 50మంది భక్తబందం ఉంటే..ఏపుణ్య క్షేత్రానికి, పుష్కర స్నానఘాట్, పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక చార్జీపై బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement