ఏపీ రాజకీయ నాయకులకు చెందిన బస్సులు తెలంగాణలో తిరగడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆంధ్రా ఎంపీ జేసీ సోదరుడు దౌర్జన్యాలు చేస్తున్నాడన్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
• తెలంగాణలో వాళ్లు వందల బస్సులు తిప్పుతున్నారు
• ఏపీకి తెలంగాణ బస్సులు రెండు వెళితే సీజ్ చేయించాడు
• వెంటనే అన్ని పర్మిట్లు పునరుద్ధరించాలని డిమాండ్
• కాలపరిమితి ముగిసే వరకు నడిచే అవకాశం ఉందన్న మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజకీయ నాయకు లకు చెందిన బస్సులు తెలంగాణలో తిరగడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పం దంపై పెద్ద గొడవే జరిగింది. ఆంధ్రా ప్రాం తానికి చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సోద రుడు ప్రభాకర్‌రెడ్డి తెలంగాణ ట్రావెల్స్ యజ మానులపై దౌర్జన్యం చేస్తున్నాడని, మళ్లీ దర్జాగా తెలంగాణలో బస్సులు తిప్పుతు న్నాడని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ‘ఆరెంజ్ ట్రావెల్స్ పేరుతో సునీల్‌రెడ్డి అనే తెలంగాణ వ్యక్తి ట్రావెల్స్ నడుపుతున్నాడు. ఆయన బస్సులు రెండు బెంగళూరుకు వెళితే మధ్యలో ఆపిన ప్రభాకర్‌రెడ్డి బస్సులను సీజ్ చేయిం చాడు. కాగితాలు చూపించినా.. వాటిని చిం చేసి మరీ దౌర్జన్యం చేశాడు.
అదే ప్రభాకర్‌రెడ్డి వందల సంఖ్యలో బస్సులను తెలంగాణలో తిప్పుతున్నాడు. వెంటనే దీనిని నియంత్రిం చాలి. ఏపీ నుంచి వచ్చే బస్సులను నియం త్రించాలి’అని డిమాండ్ చేశారు. స్పందించిన మంత్రి మహేందర్‌రెడ్డి పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 74 ప్రకారం రాష్ట్రం విడిపోకముందు తీసుకున్న ప్రైవేటు పర్మిట్లు కాలపరిమితి ముగిసే వరకు ఉంటాయని, అప్పటివరకు ఆ పర్మిట్లు ఉన్న బస్సులు రెండు రాష్ట్రాల్లో తిరిగేందుకు అవకాశముందని చెప్పారు. తెలంగాణ రాక ముందు ఆంధ్ర ప్రాంతానికి చెందిన పర్మిట్లు 946 ఉన్నాయని, తెలంగాణకు చెందినవి 444 ఉన్నాయని, తెలంగాణ వచ్చాక ఆంధ్రకు చెందిన పర్మిట్లు 641కి తగ్గగా, తెలంగాణ పర్మిట్లు 487కు పెరి గాయని చెప్పారు.
ఈ పర్మిట్లకు సంబంధించిన అంతర్రాష్ట్ర ఒప్పందంపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం కూడా జరిగిందని, అసెంబ్లీ ముగిసిన తర్వాత ఈ ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. ఆరెంజ్ ట్రావెల్స్ విషయం తమ దృష్టికి రాలేదని, తెలంగాణ ప్రాంతానికి చెందిన ట్రావెల్ యజమానులను ప్రోత్సహిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు.