
'ఏపీ ప్రైవేట్ బస్సులపై పన్ను తప్పదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రైవేట్ బస్సులపై అంతర్రాష్ట్ర పన్ను విధానం పద్ధతిని అమలు చేస్తామని తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జీవో నెంబర్ 43 పై వెనక్కు తగ్గేదిలేదని పేర్కొన్నారు.
పన్ను ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రైవైట్ ట్రావెల్స్ యజమానులు, ఏపీ ప్రభుత్వం విన్నవించిన నేపథ్యంలో మహేందర్ రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం నడుచుకుంటోందని, ప్రైవేట్ ట్రావెట్ యాజమాన్యాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఏకపన్ను విధానంతో నష్టపోయామని, రాష్ట్ర ఆర్థికాభివృద్దికి పన్ను భారం తప్పదని మహేందర్ రెడ్డి అన్నారు.