inter state Tax policy
-
'ఏపీ ప్రైవేట్ బస్సులపై పన్ను తప్పదు'
-
'ఏపీ ప్రైవేట్ బస్సులపై పన్ను తప్పదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రైవేట్ బస్సులపై అంతర్రాష్ట్ర పన్ను విధానం పద్ధతిని అమలు చేస్తామని తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జీవో నెంబర్ 43 పై వెనక్కు తగ్గేదిలేదని పేర్కొన్నారు. పన్ను ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రైవైట్ ట్రావెల్స్ యజమానులు, ఏపీ ప్రభుత్వం విన్నవించిన నేపథ్యంలో మహేందర్ రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం నడుచుకుంటోందని, ప్రైవేట్ ట్రావెట్ యాజమాన్యాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఏకపన్ను విధానంతో నష్టపోయామని, రాష్ట్ర ఆర్థికాభివృద్దికి పన్ను భారం తప్పదని మహేందర్ రెడ్డి అన్నారు. -
అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ బస్సులు నిలిపివేత
-
అర్ధరాత్రి నుంచి ఏపీ ప్రైవేట్ బస్సులు నిలిపివేత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే ప్రైవేట్ బస్సులు భారీ సంఖ్యలో నిలిచిపోనున్నాయి. ఈ రోజు అర్థ రాత్రి నుంచి దాదాపు 80 శాతం బస్సులు నిలిపివేయనున్నారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణలో పన్ను వసూలు చేయనున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నుంచి పన్నుల విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యజమానులు సమావేశమై.. బస్సులు ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పన్ను ఆలోచన విరమించుకొండి: శిద్దా రాఘవరావు ఏపీ నుంచి వచ్చే రవాణ వాహనాలపై పన్ను విధించే ఆలోచనని విరమించుకోవాలని రోడ్లు, భవనాలు, రవాణ శాఖమంత్రి శిద్దా రాఘవరావు తెలంగాణ సర్కారుని కోరారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అటు ఆంధ్రా ప్రాంతానికి కూడా వ్యాపారం, పుణ్య క్షేత్రాల సందర్శరార్థం పెద్ద ఎత్తున తెలంగాణ వాహనాలు వస్తాయన్నారు. రవాణా పన్ను విషయంలో ఇరు రాష్ట్రాలు కలిస్తే ఎవరిపైనా ఆర్ధిక భారం లేకుండా ఉంటుందని మంత్రి తెలిపారు.