
ఆర్టీసీ ఆర్‌ఎం శివకుమార్
గోదావరి అంత్య పుష్కరాల దృష్ట్యా ఈనెల 31నుంచి వచ్చేనెల 11వతేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం శివకుమార్ తెలిపారు.
- ఆర్టీసీ ఆర్‌ఎం శివకుమార్
ఖమ్మం మామిళ్లగూడెం : గోదావరి అంత్య పుష్కరాల దృష్ట్యా ఈనెల 31నుంచి వచ్చేనెల 11వతేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం శివకుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఆగస్టు12 నుంచి 23వ తేదీ వరకు జరిగే కృష్ణ పుష్కరాలకు కూడా జిల్లా నుంచి విజయవాడ, వేదాద్రి, మట్టపల్లిలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఖమ్మం నుంచి మట్టపల్లి, విజయవాడ, వేదాద్రికి 60 బస్సులు, మధిర నుంచి విజయవాడ, వైరా నుంచి వేదాద్రికి 25, సత్తుపలి ్లనుంచి విజయవాడకు 40, కొత్తగూడెం నుంచి విజయవాడ, వేదాద్రికి 35, మణుగూరు నుంచి విజయవాడకు 25, భద్రాచలంనుంచి విజయవాడ, వేదాద్రికి 40 ప్రత్యేక బస్సులు నడుతున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. 50 మంది భక్తబృందం ఉంటే ఏ పుణ్యక్షేత్రానికైనా, పుష్కర స్నానఘాట్‌లకు, టూరిస్ట్ ప్రదేశాలకు కూడా ప్రత్యేక చార్జీపై బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.