అనంతపురం (హిందూపురం) : తమ గ్రామానికి బస్సులు నడపాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమన్‌దేవ్‌పల్లి మండలం కేతంగి చెరువు గ్రామస్తులు హిందూపూర్ వరకు గురువారం పాదయాత్ర చేశారు. అనంతరం హిందూపూర్ ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేసి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామానికి బస్సు లేకపోవడం వల్ల కాలేజీలకు, సూళ్లకు వెళ్లాలంటే ఇబ్బంది కలుగుతుందని పాదయాత్రలో పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.