బస్టాండులు సరే... బస్సులేవి
► విధ్యార్థులకు ఉచిత బస్సుపాసులు ఇచ్చిన అవి నిరుపయోగమే.
రాజాపూర్: జాతీయ రహదారిని ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చి రహదారిపై ఉన్న గ్రామాల వద్ద ప్రయాణికులకోసం అందమైన బస్టాండులు నిర్మించారు కాని బస్సులేవి మరి అంటు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి, రాజాపూర్, రంగారెడ్డిగూడ, కేతిరెడ్డిపల్లి తదితర గ్రామాల బస్టాపుల వద్ద జీఎమ్మార్ సంస్థ బస్టాండ్‌లు నిర్మించింది కాని ఇటు జడ్చర్ల, అటు షాద్‌నగర్, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా ఆర్టీసి సంస్థ ఆర్డినరి బస్సులు నడపకపోవడం మూలంగా ప్రయాణికులు ప్రయివేటు జీపులు, ఆటోలను ఆశ్రయించి ప్రమాదాలకు గురవుతున్నారు.
గతంలో షాద్‌నగర్ డిపోకు చెందిన లోకల్ బస్సులు నడిచేవని దీంతో ప్రయాణికులకు సమస్య ఉండేది కాదని ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విధ్యార్థులు జడ్చర్ల, బాలానగర్, షాద్‌నగర్ పట్టణాలకు విద్యానభ్యశించేందుకు పాఠశాలలకు, కళాశాలలకు ప్రతినిత్యం వెలుతుంటారు. పట్టణాలనుండి పల్లెల్లో, మండల కేంద్రంలో పనిచేసేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు వస్తుంటారు. విధ్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇచ్చిన బస్సులు లేకపోవడంతో అవి నిరుపయోగమే అవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని బస్సులు ఆపేవిదంగా చర్యలు తీసుకోవాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఆర్టీసీ ఆర్డినరి బస్సులు లేక ప్రయివేటు వాహనాల్లో వెళ్లక తప్పడంలేదు :
గతంలో షాద్‌నగర్ డిపోకు చెందిన షెటిల్ బస్సులు జడ్చర్ల,షాద్‌నగర్ పట్టణాలకు నడిపేవారు. అవి రద్దు చేయడంతో పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు బాగ ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్తులకు ఉచిత బస్సుపాసులు ఇచ్చారు. బస్సులే లేవు బస్సులు ఎంచేసుకోవాలి. తప్పని పరీస్థీతుల్లో ప్రయివేటు జీపులు, ఆటోలు ఆశ్రయించక తప్పడం లేదు.