టీనగర్: విద్యార్థులకు ఉచిత బస్సు పాసుల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి జయలలిత శనివారం ప్రారంభించారు. సచివాలయంలో ఉదయం తిరువళ్లూరు జిల్లా, గుమ్మిడిపూండిలో రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన డ్రైవర్ల పరిశోధనా శిక్షణ కేంద్రానికి శంఖుస్థాపన, రవాణా సంస్థ భవనాలను ప్రారంభించారు. అధికారులకు జీపులను అందచేశారు. గుమ్మిడిపూండిలో రవాణాసంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించిన అతిథి గృహా నికి శంఖుస్థాపన చేశారు. కుంభకోణం, కోయంబత్తూరు, తిరునెల్వేలి ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను ప్రారంభించారు.
విద్యార్థులకు ఉచిత బస్సు పాసుల పంపిణీ :
ముఖ్యమంత్రి జయలలిత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 28 లక్షల 50వేల విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అందచేసే పథకం కింద ముగ్గురు విద్యార్థినులకు ఉచిత బస్సు పాసులను అందచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్యమంత్రి జయలలితకు తమ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ, ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుందర్, తమిళనాడు ప్రభుత్వ సలహాదారుడు షీలా బాలకృష్ణన్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి అపూర్వ వర్మ, రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ టి.ప్రభాకరరావు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఉచిత బస్సు పాసుల పంపిణీ
Published Sat, Jul 5 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement