himacal Pradesh
-
సాహసం శ్వాసగా.. బాధితులకు అండగా.. రెస్క్యూ బృందాలు!
భారీ వరదలు, వర్షాలు హిమాచల్‌ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్క్యూ బృందాలు మ్తొతం 50 వేల మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కరా ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న 28 మంది గొర్రెల కాపరులను, పర్యాటకులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. #WATCH | NDRF's Joint Rescue Ops saved 28 stranded shepherds/trekkers from Kinnaur, Himachal Pradesh's Kara area. Due to rising water levels, 11 people were trapped 15 kilometres from Kafnu village. On July 10th, the NDRF team, along with ITBP and Home Guard personnel, embarked… pic.twitter.com/e8Ns5CNQ9A — ANI (@ANI) July 12, 2023 అలాగే వరద ఉధృతిలో చిక్కుకున్న మరో 15 మందిని కూడా తాళ్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఐటీబీపీ, హోమ్‌గార్డ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు, వరదల కారణంగా హెచ్ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లింది. వరదల్లో సుమారు 300 బస్సులు చిక్కుకుపోయాయని సంబంధిత అధికారులు తెలిపారు.హెచ్ఆర్టీసీ బస్సులు మొత్తం 3,700 రూట్లలో తిరుగుతుండగా, ప్రస్తుతం 1200 రూట్లలో బస్సులు నడపలేని పరిస్థితి నెలకొంది. ఇది కూడా చదవండి: యుమునా ఉగ్ర రూపం.. వరద గుప్పిట్లో సీఎం కేజ్రీవాల్ నివాసం -
రిషితకు అశ్రునివాళి
సోమవారం ఇంటికి చేరిన మృతదేహం తల్లిదండ్రులు,స్నేహితులు కన్నీరు మున్నీరు అంత్యక్రి యలు పూర్తి జగద్గిరిగుట్ట: ‘కాలేజీ నుంచి రావడంలో ఐదు నిమిషాలు ఆలస్యమైతేనే ఆందోళన చెందే మేము ఇప్పుడు నువ్వు మా నుంచి శాశ్వతంగా దూరమయ్యావన్న ఛేదు నిజాన్ని ఎలా తట్టుకోవాలి’.. అంటూ రిషితారెడ్డి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. హిమచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థిని రిషితారెడ్డి మృతదేహం 42 రోజుల తర్వాత లభించింది. మృతదేహం లభించినట్టు అధికారులు తల్లిదండ్రులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. ఈ దుర్వార్త విన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దేవుడా! ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న మా ఒక్కగానొక్క కూతుర్ని తీసుకుపోయావా.. అంటూ గుండెలవిసేలా రోదిస్తూనే ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 1.35కి రిషితారెడ్డి మృతదేహాన్ని తహసీల్దార్ కృష్ణ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బాచుపల్లిలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బంధువులు, విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థులు, సిబ్బంది రిషిత మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య బాచుపల్లిలోని శ్మాశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బియాస్ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బియాస్ నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు 24 మంది, అంతకు ముందు పులిచింతల వద్ద చనిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసి స్నేహితులు నివాళులర్పించారు.