
ప్రకాశం, సాక్షి: ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత పులి కలకలం రేపింది. గుంతలో చిక్కుకొని ఉన్న చిరుత పులిని గ్రామస్తులు గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించడానికి వలలు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించారు.
బుధవారం రాత్రి చీకటి కావడంతో రెస్క్యూకి చర్యలకు అంతరాయం కలిగింది. ఇవాళ తిరుపతి నుంచి వచ్చిన టైగర్ రెస్కూ టీమ్.. చిరుత పులిని బంధించి అడవిలో వదలనున్నారు.
ఇదిలా ఉంటే.. నంద్యాల మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం భక్తులు, స్థానికుల్లో భయాందోళనకు కారణమైంది. గోశాల, అన్నదాన సత్రం దగ్గర చిరుత సంచరించిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.