రెస్యూటీమ్ ప్రత్యేక శిక్షణ
కాకినాడ యాంకరేజ్ పోర్టులో ప్రత్యేక స్విమ్మింగ్ సెంటర్
తొలిబ్యాచ్‌కు ముగిసిన శిక్షణ
కాకినాడ రూరల్: జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలైన తుపాను, వరదల సమయంలో ఆపదలో ఉన్న ప్రజలను, మత్స్యకారులను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్‌పీఎఫ్) సిబ్బంది సముద్రంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. మంగళగిరిలోని నేషనల్ డిజాస్టర్ రెస్పెన్స్ ఫోర్సులో (ఎన్‌డీఆర్‌ఎఫ్)లో శిక్షణ పొంది వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకులతో ప్రత్యేక రెస్కూ ్య టీమ్‌ను తయారు చేశారు. వారిలో 17 మంది వారం రోజులపాటు కాకినాడ యాంకరేజ్ పోర్టు కస్టమ్స్ కార్యాలయంలో శిక్షణ పొందారు. వారు గురువారం తాము నేర్చుకున్న అంశాలను ప్రత్యేకంగా సముద్రంలో చేసి చూపించారు. ఏపీ ఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పర్యవేక్షణలో ఎస్‌పీఎఫ్ కమాండెంట్ డీఎన్‌ఏ భాషా ఆధ్వర్యంలో ప్రత్యేక కోచ్ బి. మదన్‌మోహన్‌రావు వీరికి డిసెంబర్ 28 నుంచి జనవరి 5వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. రెస్కూ ్య పవర్‌బోట్స్ (రబ్బర్ ఇంజన్ బోటు)ను ఉపయోగించి వారు సహాయ చర్యలు చేపడతారు. ఒక్కొక్క బోటుపై ఐదుగురు ఉంటూ ఆపద సంభవిస్తే బాధితులను రక్షించేందుకు సిద్ధంగా ఉండేలా వారికి శిక్షణ ఇచ్చారు. బోటులో ఉండే వారికి ప్రత్యేక లైఫ్ జాకెట్లు, చేపలా ఈదేందుకు వీలుగా కాళ్లకు ప్రత్యేక బూట్లు, కళ్లద్దాలు, సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించేందుకు వీలుగా ప్రత్యేక ఆక్సిజెన్ సిలెండర్ వంటివి బోటుల్లో ఉన్నాయి. శిక్షణ ముగింపు సందర్భంగా వారు ఆపదలో ఉన్న వ్యక్తులను ఎలా రక్షించేదీ చేసి చూపించారు. దీన్ని ప్రత్యేక స్విమ్మింగ్ సెంటర్‌గా రూపొందిస్తూ ఒక టీముకు శిక్షణ పూర్తయిన తరువాత మరో టీముకు ఈ అంశాల్లో శిక్షణ ఇస్తామని కమాండెంట్ బాషా తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ కేవీ రవిచంద్ర, ఎస్సై ఈశ్వర్ పాల్గొన్నారు.