
సాక్షి, నెల్లూరు: పెనుసిల అభయారణ్యంలో తప్పిపోయిన కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన బాలుడు సంజు కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బాలుడు ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలతో అధికారులు జల్లెడ పడుతున్నారు. బాలుడి కోసం పోలీసు జాగిలాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంజు అదృశ్యమైన రోజు ఆ ప్రాంతంలో తిరిగిన వారి ఫోన్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment