dron cameras
-
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో డ్రోన్ కెమెరాల కలకలం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో డ్రోన్ కెమెరాలు కలకలం సృష్టించాయి. విదేశీ డ్రోన్ కెమెరాలుగా అధికారులు గుర్తించారు. ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయం కలిపి ఉండటంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రీ సర్ఫెసింగ్ పనులు కొనసాగుతున్నాయి. డ్రోన్ కెమెరాలను అధికారులు సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జాడలేక 10 రోజులాయే.. సంజూ ఎక్కడున్నావ్ నాన్నా..
‘నాన్నా.. ఎక్కడున్నావు.. నీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.. బుడిబుడి అడుగులతో అమ్మా అంటూ నా చీర పట్టుకుని తిరుగుతుంటే చూడాలని ఉంది బిడ్డా.. నిన్ను చూడకుండా నేనెలా బతకాలి కన్నా.. నీ కోసం మేమే కాదు.. కాలనీవాసులు, పోలీసులు రాత్రీపగలు తేడా లేకుండా వెతుకుతున్నాం.. త్వరగా కనిపించు నాన్నా..’ తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి దండు సంజు తల్లిదండ్రుల ఆవేదన ఇది.. సాక్షి, నెల్లూరు: కలువాయి మండలం ఉయ్యాలపల్లి దళితవాడకు చెందిన దండు బుజ్జయ్య, లక్ష్మమ్మకు ముగ్గురు మగపిల్లలున్నారు. వారిలో సంజు రెండో బిడ్డ. బుజ్జయ్య గొర్రెలు మేపుతాడు. లక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. గొర్రెలు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్తున్న బుజ్జయ్య వెంట చిన్నారి సంజు (3) వెళ్లేవాడు. కొంత దూరం వరకు వెళ్లిన చిన్నారిని తిరిగి ఇంటికి చేర్చడం నిత్యం జరుగుతుండేది. కానీ గత నెల 29వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో చిన్నారి తండ్రి వెళ్లిన కాసేపటికి అటవీ ప్రాంతం వైపు వెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. అప్పటినుంచి సంజు ఆచూకీ లభించలేదు. జల్లెడ పడుతున్న పోలీసులు సంజు ఆచూకీ కోసం పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఏఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, కలువాయి ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది రోజూ సంజు కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అడవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఉయ్యాలపల్లి తెగచర్ల పరిసర ప్రాంతాలతోపాటు, సమీప అటవీ ప్రాంతంలో పోలీస్ బృందాలు తీవ్రస్థాయిలో గాలించాయి. రెండు రోజుల క్రితం పోలీస్ జాగిలాన్ని రప్పించి అడవిలో తిప్పారు. ముందుగా బాలుడు వాడుతున్న చెప్పులను వాసన చూపించారు. జాగిలం అక్కడి నుండి రెండు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో తిరిగి ఆగిపోయింది. డాగ్ స్క్వాడ్ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే 10 రోజులు గడచినందున దుస్తులు తదితరాల కంటే చెప్పుల ద్వారా జాగిలాలు వాసనను బాగా పసిగట్టగలవని తెలిపారు. జాగిలం బాగా అలసిపోయిందని, విశ్రాంతినిచ్చారు. మళ్లీ గాలింపు చేపట్టనున్నారు. అలాగే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు వేయించి రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు పంపించారు. ఎత్తుకెళ్లి ఉంటారా? సంజును ఎవరైనా అపరిచితులు ఎత్తుకెళ్లి ఉంటారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. తల వెంట్రుకల కోసం ఊరూరా తిరిగే కొందరు అపరిచితుల వ్యక్తులు బిడ్డను అపహరించి విక్రయించుకునే అవకాశం కూడా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తప్పిపోయిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్‌టవర్ డంప్ ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. క్షేమంగా ఉంటాడని.. సంజు ఆచూకీ లభ్యం కాకపోవడం.. పరిసర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో కూడా బిడ్డ ఆనవాళ్లు లేకపోవడంతో ఎక్కడో చోట క్షేమంగా ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ చిన్నారికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే తప్పక ఆనవాళ్లు లభించేవని, త్వరలోనే ఆచూకీ తెలుసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాం చిన్నారి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాన్ని గాలించాం..డ్రోన్ కెమెరాలతోపాటు పోలీస్ డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి గాలించాం. త్వరలోనే బిడ్డ ఆచూకీ కనుగొంటాం. – వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఆత్మకూరు -
బాలుడు సంజు కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
దొరకని సంజూ ఆచూకీ.. డ్రోన్ కెమెరాలతో గాలింపు
సాక్షి, నెల్లూరు: పెనుసిల అభయారణ్యంలో తప్పిపోయిన కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన బాలుడు సంజు కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బాలుడు ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలతో అధికారులు జల్లెడ పడుతున్నారు. బాలుడి కోసం పోలీసు జాగిలాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంజు అదృశ్యమైన రోజు ఆ ప్రాంతంలో తిరిగిన వారి ఫోన్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. -
మావోయిస్టుల కట్టడికి ఐదు రకాల డ్రోన్లు!
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తర్వాత పోలీసులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దట్టమైన అడవిలో అణువణువు తెలిసిన మావోయిస్టుల్లా వెళ్లడం సాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో డ్రోన్లను వినియోగించి మావోయిస్టుల కదలికలను పసిగట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించారు. పది రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం దేశవ్యాప్తంగా తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాలతోపాటు వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో ఐదు రకాల డ్రోన్లను వాడనున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలను అనుసరించి వాటిని అందుబాటులోకి తేనున్నారు. 250 గ్రాముల బరువు ఉండే నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు ఉండే మైక్రో డ్రోన్, 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండే స్మాల్ డ్రోన్, 25 కిలోల నుంచి 150 కిలోలుండే మీడియం డ్రోన్, 150 కిలోలకు పైబడి బరువుండే లార్జ్ డ్రోన్లను ఉపయోగించాలని ప్రతిపాదించారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ బలగాల చేతికి.. కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ప్రతి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి నాలుగు డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఢిల్లీ వరకు అనుసంధానం చేసేలా సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరే శక్తి ఉంటుంది. వీటి ద్వారా పగటి పూట హెచ్డీ క్వాలిటీ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం సులువని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అడవుల్లోనూ వినియోగించేలా.. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని అడవుల్లో సంచరించే మావోయిస్టులను గుర్తించేలా డ్రోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనికోసం శిక్షణ పొందిన పోలీసులను ఉపయోగించుకోనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేస్తారు. మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేసే ప్రత్యేక పోలీసు బలగాలకు దారి చూపించడానికి కూడా వీటిని వినియోగిస్తారు. అవసరమైతే మావోయిస్టులను కాల్చిచంపేలా వాటిని ఉపయోగిస్తారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి నేరుగా బాంబులు ఉన్న డ్రోన్ (సూసైడ్ డ్రోన్)లను పంపి పేలుళ్లు చేయాలని భావిస్తున్నారు. -
అగ్నిమాపక రోబో!
సాక్షి, ముంబై : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి ప్రాణహాని జరగకుండా రోబోలు కొనుగోలు చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) భావిస్తోంది. అలాగే కెమికల్ ఫ్యాక్టరీలలో రసాయనాలకు మంటలు అంటుకున్నప్పుడు అవి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో సిబ్బందికి ప్రాణహాని జరిగే ఆస్కారముంటుంది. ఇలాంటి సమయంలో రోబోలు ఎంతో దోహదపడతాయని బీఎంసీ భావిస్తోంది. అదేవిధంగా అగ్ని ప్రమాద తీవ్రత తెలుసుకునేందుకు డ్రోన్ల సాయం కూడా తీసుకోవాలని యోచిస్తోంది. డ్రోన్ల అనుమతికి చర్చలు.. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటు మంటల తీవ్రతకు సంఘటన స్థలానికి దగ్గర వరకు వెళ్లలేక.. అటు అందులో చిక్కుకున్న వారిని కాపాడటానికి తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వస్తుంది. దీంతో అనేక సందర్భాలలో అగ్నిమాపక సిబ్బంది గాయడటం లేదా చనిపోవడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. వీటికి స్వస్తి చెప్పాలంటే రోబోలు ఎంతో ఉపయోగపడతాయని బీఎంసీ భావిస్తోంది. రాత్రివేళల్లో పైఅంతస్తుల్లో మంటలు అంటుకున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉంటుంది. ఒక పక్క చీకటి, మరోపక్క లిఫ్టులు పనిచేయవు. దీంతో ప్రమాదస్థలికి దగ్గర వరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. అలాంటి సమయంలో ప్రమాద తీవ్రతను గుర్తించి ఆ ప్రకారం వ్యూహాత్మక చర్యలు చేపట్టేందుకు డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయి. కానీ, ముంబైలో డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదు. అందుకు విమానయాన శాఖ, ముంబై పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై వివిధ కోణాల్లో చర్చలు జరుపుతున్నారు. అనుమతి లభించగానే డ్రోన్లు కొనుగోలు చేయడానికి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అగ్నిమాపక శాఖ చీఫ్ ప్రభాత్ రహందళే చెప్పారు. అందుకు అగ్నిమాపక శాఖకు రూ.151 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. కాగా, అగ్నిమాపక సిబ్బందికి రూ.30 లక్షల బీమా పాలసీ, విధినిర్వహణలో మృతి చెందిన జవాన్ల పిల్లల చదువులకయ్యే ఖర్చు బీఎంసీ భరించనుందని ఆయన అన్నారు. -
తిరుమలలో ‘డ్రోన్’ కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శేషాచలంతోపాటు తిరుమలకొండ మీద ఉద్యాన వనాల అభివృద్ధి కోసం నెల రోజులుగా డ్రోన్ కెమెరాతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ నాలుగు మాడ వీధులు, సమీప ప్రాంతాలు మినహా మిగిలిన అటవీ, కాటేజీ ప్రాంతాల్లో ఈ సర్వే చేసుకునేందుకు టీటీడీ అనుమతినిచ్చింది. ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నేతృత్వంలో బెంగళూరుకు చెందిన జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్ ఎఫ్) నిపుణుల బృందం ఈ సర్వే నిర్వహిస్తోంది. డ్రోన్ కెమెరాను పక్షి ఢీకొనడంతో సిగ్నల్స్ తెగిపోయి డ్రోన్ కెమెరా స్థానిక శేషాద్రినగర్‌లోని ఓ చెట్టుపై ఇరుక్కుంది. స్థానికుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. -
పోలీస్ దిగ్బంధంలో రావులపాలెం
భారీగా బలగాల మోహరింపు రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్స్ కవాతు ∙ ముద్రగడ యాత్ర డ్రో¯ŒS కెమెరాలతో నిఘా రావులపాలెం : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో రావులపాలెం పోలీస్ దిగ్బంధంలో చిక్కుకుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ముద్రగడ స్థానిక కళావెంకట్రావు సెంటరులో ఈ పాదయాత్ర ప్రారంభించనుడడంతో పోలీస్ ఉన్నతాధికారులు రావులపాలెంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్, అడిషనల్ ఎస్పీలు ఏఆర్ దామోదర్, శ్రీనివాసరావు, శివారెడ్డి, ఐదుగురు డీఎస్పీలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఒక్క రావులపాలెంలోనే సుమారు వెయ్యి మంది పోలీసులతోపాటు ఏపీఎస్పీ, రాపిడ్యాక్ష¯ŒS ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు రావులపాలెంలో మోహరించారు. రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్స్ కవాతు రావులపాలెం చేరుకున్న రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్స్ స్థానిక కళావెంకట్రావు సెంటరు నుంచి అరటి మార్కెట్ యార్డు వరకూ అక్కడ నుంచి తిరిగి కళావెంకట్రావు సెంటరు వరకూ రింగ్‌రోడ్డు, మార్కెట్ రోడ్డు మీదుగా పోలీస్‌స్టేçÙ¯ŒS వరకూ కవాతు నిర్వహించింది. ఏపీ పీకే రావత్ సారధ్యంలో ఫోర్స్ కవాతు చేశారు. డ్రోన్లతో పర్యవేక్షణ ముద్రగడ యాత్ర సమయంలో అణుఅణువు పరిశీలించేందుకు అధిక సంఖ్యలో డ్రో¯ŒS కెమెరాలను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం వీటిని ప్రయోగాత్మకంగా కళావెంకట్రావు సెంటరులో పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్, కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్ పర్యవేక్షణలో ఐదు డ్రో¯ŒS కెమెరాలను నాలుగు వైపుల నుంచి ప్రయోగించారు. దివిలిలో ఉత్కంఠ పెద్దాపురం : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యగ్రహ యాత్ర చేపటనున్న నేపథ్యంలో పెద్దాపురం మండలం దివిలిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కిర్లంపూడి నుంచి కోనసీమకు దివిలి మీదుగా వెళ్లనుండడంతో పోలీస్ యంత్రాంగం దివిలి జంక్ష¯ŒSలో అప్రమత్తమైంది. ప్రత్తిపాడు నుంచి సామర్లకోట వైపునకు వెళ్ళే కాపు నేతల కార్లు, వాహనాలు మంగళవారం ఉదయం అడ్డుకోవడంతో ఒకానొక సమయంలో ఉత్కంఠ పరిస్థితులు ఎదురయ్యాయి. వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజవకర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు కిర్లంపూడి నుంచి కాండ్రకోట వెళ్లుతుండగా తిరుపతి రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి కూడా ఇలానే అడ్డుకుంటే వివరంగా చెప్పినా మళ్ళీ వాహనాన్ని ఆపడం సమంజసం కాదని చెప్పినప్పటికీ ఎక్కడికీ వెళ్ళుతున్నారో చెప్పాలంటూ పోలీసులు అనడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కాపు ఉద్యమంపై ఇంత అక్కసు పని చేయదని, కనీసం సొంత పనులకు కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం దారుణమని సుబ్బారావు నాయుడు అన్నారు. ఖాకీ రాజ్యంగా చంద్రబాబు పాలన : జక్కంపూడి విజయలక్ష్మి తాడితోట (రాజమహేంద్రవరం) : చంద్రబాబు పాలన కాకీ రాజ్యంగా మారిందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాద యాత్ర సందర్భంగా రాజమహేంద్రవరంలో గృహ నిర్బంధంలో ఉన్న జక్కంపూడి విజయలక్ష్మి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గృహ నిర్బంధం చేసి నాయకులను భయపెట్టలేరని, సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటున్న వారిపై పోలీసులను అడ్డుపెట్టుకొని అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకుంటున్నారన్నారు. ముద్రగడ యాత్రను ఆపేందుకు ప్రభుత్వం యుద్ధ వాతావరణం సృష్టిస్తోందని అన్నారు. కాపు నేతల అరెస్టులు అన్యాయం : కురసాల కన్నబాబు సాక్షిప్రతినిధి, కాకినాడ : అసలు రాష్ట్రంలో పాలన సాగిస్తోంది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేదా అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాపు ఉద్యమం, దివీస్ కాలుష్య కర్మాగారం భూ సేకరణ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సెక్ష¯ŒS 30, 144 సెక్ష¯ŒSలు అమలు చేస్తూ చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ సహా పలువురు కాపు జేఏసీ నేతలు పోలీసులు గృహనిర్బంధించడంపై మంగళవారం రాత్రి కన్నబాబు స్పందిస్తూ ప్రభుత్వ చర్యను ఖండించారు. కోనసీమలో అన్ని పోలీసు బలగాలను మోహరింప చేయడంలో ప్రభుత్వ ఉద్ధేశం ఏమిటో అర్థంకావడం లేదన్నారు. గద్దెనెక్కేందుకు చంద్రబాబు ఎన్నికల్లో వెనుకాముందూ చూసుకోకుండా హామీలు ఇచ్చేసి ఇప్పుడు కాపులు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో ఉక్కుపాదం మోపడం అన్యాయమన్నారు. కాపులను అరాచశక్తులుగా ముద్రవేసి మిగిలిన వర్గాలకు దూరంచేసే కుట్రతోనే చంద్రబాబు ఇటువంటి దగాకోరు విధానాలకు పాల్పడుతున్నారని కన్నబాబు విమర్శించారు.