గని ప్రమాదం.. 14 మంది అధికారులు సేఫ్‌.. ఒకరు మృతి | Mine Rescued Safely Know All Updates | Sakshi
Sakshi News home page

గని ప్రమాదం.. 14 మంది అధికారులు సేఫ్‌.. ఒకరు మృతి

Published Wed, May 15 2024 9:34 AM | Last Updated on Wed, May 15 2024 1:40 PM

Mine Rescued Safely Know All Updates

రాజస్థాన్‌లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన గనిలో మంగళవారం రాత్రి చిక్కుకున్న 15 మంది అధికారులలో 14 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఒక అధికారి మరణించినట్లు  వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. నాలుగు దశల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. వారిని జైపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గనిలో 1,875 అడుగుల లోతులో లిఫ్ట్ చైన్ తెగిపోవడంతో ప్రమాదం సంభవించింది.
 

ఈ ప్రమాదంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉపేంద్ర పాండే మరణించారు. అతని మృతదేహాన్ని కేసీసీ ఆస్పత్రికి తరలించారు. కాగా గనిలోని లిఫ్ట్‌లో ఏదో లోపం ఉందని, మరమ్మతులు చేయించాలని ఎనిమిది రోజుల క్రితం కెసిసి యాజమాన్యానికి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.  అయినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ స్వయంగా  దృష్టి సారించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement