ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో సోమవారం అర్థరాత్రి రెండు ఇళ్లు కూలిపోయాయి. చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోయా గల్లీ కూడలి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదం దరిమిలా కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లే నాల్గవ నెంబరు ద్వారాన్ని మూసివేశారు. ఆలయానికి వెళ్లే సందర్శకులకు గేట్ నంబర్ వన్, గేట్ నంబర్ టూ నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు. కూలిపోయిన రెండు ఇళ్లు 70 ఏళ్ల క్రితం నాటివని అధికారులు తెలిపారు.
#WATCH | Kaushal Raj Sharma, Commissioner Varanasi Division says "Two houses collapsed here in which 9 people were trapped. 2 of them came out on their own and 7 others were rescued. One woman has lost her life and the remaining are under treatment. The rescue operation is almost… pic.twitter.com/YWhycEVmgZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 6, 2024
Comments
Please login to add a commentAdd a comment