మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
అకస్మాత్తుగా ఇల్లు కూలిపోవడంతో 12 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, శిథిలాల నుండి మొత్తం ఆరుగురిని వెలికితీశారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. గాయపడిన ముగ్గురిని లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించారు.
మీరట్ డిఎం దీపక్ మీనా మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా జాకీర్ కాలనీలోని మూడంతస్తుల ఇల్లు కూలిన విషయాన్ని ధృవీకరిస్తూ, శిథిలాల కింద ఆరుగురు సమాధి అయ్యారని తెలుస్తోందని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: చమురు ట్యాంకర్‌కు మంటలు
Comments
Please login to add a commentAdd a comment