సాక్షి, జగిత్యాల: జిల్లాలో కలకలం రేపిన నవ వధువు కిడ్నాప్ కేసును 24 గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. పోరండ్ల గ్రామంలో సోమవారం మధ్యాహ్నం కిడ్నాపైన నవ వధువును జగిత్యాల పోలీసుల రక్షించారు. కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో కిడ్నాపర్ల చెరనుంచి బాధితురాలిని విడిపించారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్, సారంగాపూర్ మండటం పెంబట్ల గ్రామానికి చెదిన సమత కులాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం సమత సోదరుడు సాయికుమార్‌తోపాటు మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బుర్రల ప్రవీణ్ కారులో పొరండ్ల గ్రామానికి వచ్చి మరో నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి రాకేశ్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి సమతను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమతను కిడ్నాపర్ల చేర నుంచి విడిపించారు. (చదవండి: 40 లక్షల అప్పు.. బాలుడి కిడ్నాప్)
Comments
Please login to add a commentAdd a comment