
సాక్షి, ముంబై: మానవత్వాన్ని చాటుకునేందుకు ఎక్కడ ఎలా, ఏం చేస్తున్నాం అనేది అవసరం లేదు. ఈ ప్రపంచంలో మనతోపాటు కలిసి జీవిస్తున్నచిన్ని ప్రాణులను కూడా కాపాడుకోవాల్సింది మనుషులుగా మనపై ఉంది. ఇలా రోడ్డుపై వెడుతున్న ఓ మహిళ తాబేలును ఆదుకునేందుకు స్పందించిన తీరు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించినవీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అసలే మందగమని అయిన తాబేలు ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ రోడ్డుపై చిక్కుకుంది. అథ్లెట్‌లా చక్కటి ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్న ఒకమహిళదీన్ని గమనించా తాబేలును రక్షించేందుకు ముందుకొచ్చారు. రెండు వస్త్రాల సాయంతో దాన్ని పట్టుకుని రోడ్డుమీదినుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో లైక్స్, కమెంట్స్‌తో దూసుకు పోతోంది. హార్ట్ ఎమోజీలతో నెటిజన్లు తాబేలును రక్షించినందుకు మహిళను తెగ మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment