Heartwarming video
-
కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు
ఆ పసికందు ఎక్కడ పుట్టాడో తెలీయదు. కన్నవాళ్లు కనీసం గుడి వద్దో, ఆస్పత్రి దగ్గరో వదిలేసిన ఆ నరకం తప్పేదేమో. కానీ, కర్కశంగా చెట్ల పొదల మధ్యకు విసిరేశారు. ఆ దెబ్బకు ఏడురోజుల వయసున్న ఆ పసికందు వీపు చిట్లిపోయింది. కాకులో, ఏ జంతువులో పొడిచాయో తెలియదు. గుక్కపట్టి ఏడ్చేందుకు శక్తిలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని గుర్తించి.. ఎవరో మహానుభావులు ఆస్పత్రిలో చేర్పించారు.ఆగష్టు 26వ తేదీ. యాభైకిపైగా గాయాలతో ఉన్న ఓ పసికందును ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్పుర్ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు కొందరు. అప్పటికే ఆ బిడ్డ పరిస్థితి విషమించింది. బతుకుతాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్నారు డాక్టర్లు. అక్కడి నుంచి కాన్పూర్ లాలాలజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడా వైద్యులు ఆ బిడ్డ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. కానీ, ఏ దేవుడు చల్లగా చూశాడో తెలియదు. రెండు నెలలపాటు ప్రయత్నించి ఆ మగబిడ్డకు పునర్జన్మ పోశారు వైద్యులు.నరకం నుంచి రెండు నెలలకు.. కన్నతల్లి దూరమైనప్పటికీ.. ఆస్పత్రిలో అమ్మ ప్రేమ ఆయాల రూపంలో దొరికింది ఆ బిడ్డకు. మొదట్లో ఈ చిన్నారికి అయిన గాయాల కారణంగా ఎత్తుకునే ప్రయత్నంలోనూ ఏడ్చేవాడట. దీంతో.. ఊయలలో పడుకోబెట్టి దూరం నుంచే లాలించేవారట. ఆ సమయంలో ఆ బిడ్డ ఏడుపు.. అక్కడి సిబ్బందికి కన్నీళ్లు తెప్పించేదట. అయితే గాయాల నుంచి కోలుకునే కొద్దీ ఆ బిడ్డ కూడా వాళ్లకు అలవాటయ్యాడు.ఆగష్టు 26వ తేదీన ఆ బిడ్డ దొరికాడు. ఎవరో బ్రిడ్జి మీద నుంచి కిందకు విసిరేశారు. అయితే అదృష్టవశాత్తూ చెట్ల పొదల్లో పడ్డాడు ఆ చిన్నారి. అదే రోజు జన్మాష్టమి. అందుకే వైద్య సిబ్బంది ఆ బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టారు. రెండు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న ఆయాలందరూ.. మగ సిబ్బంది కూడా ఆ కిష్టయ్యను జాగ్రత్తగా చూసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్ 24వ తేదీన పోలీసుల సమక్షంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు వైద్యులు. కృష్ణ ఆస్పత్రి నుంచి వెళ్లిపోతుంటే.. అక్కడున్న సిబ్బంది మొత్తం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆ వెళ్తోంది తమ బిడ్డే భావించి.. అతనికి ఓ మంచి జీవితం దక్కాలని ఆశీర్వదించి పంపించేశారట. -
గోపాల మురిపాల బాల
కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్‌వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
చిన్నా.. లేరా! గుండెల్ని తాకే అమ్మ ప్రేమ
Viral Video: మనిషికి మాత్రమే అమ్మ ప్రేమ సొంతం కాదు. సకల చర ప్రాణ జీవులకూ సొంతం అది. పైగా ఈ సృష్టిలో స్వార్థంతో పోల్చలేనిది అదొక్కటి మాత్రమే!. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా ఉండదు కూడా. అమ్మ ప్రేమ గొప్పదనం నిరూపించే సాక్ష్యాలు కోకోల్లలు.. అందులో ఒకటి ఈ వీడియో. ప్రతి క్షణం పిల్లల కోసమే తపించే అమ్మ.. పిల్లలకు చిన్న కష్టం వస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది. అలాంటి గుండెల్ని హత్తుకునే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆడ ఎలిఫెంట్(భారీ సైజులో) సీల్ ఒకటి అప్పుడే ప్రసవించింది. అయితే బిడ్డ అచేతనంగా పడి ఉండడంతో.. దిగాలుగా దానిని కదిలించే ప్రయత్నం చేసింది. అటుపై ఆ పిల్లలో చలనంతో ఒక్కసారిగా అది మురిసిపోయింది. సంతోషంతో కేకలు వేసింది. ఇంటర్నేషనల్ సీల్ డే సందర్భంగా.. సైన్స్ గర్ల్ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాటేలా వ్యూస్, లైక్స్, షేర్లతో దూసుకుపోతోంది. This elephant seal mum has just given birth and is anxious her baby is still, Watch her reaction when her child moves pic.twitter.com/D3DdU7h0on — Science girl (@gunsnrosesgirl3) March 22, 2023 -
వైరల్ వీడియో: ఎల్లలు దాటిన అనురాగం.. దాయాది దేశంలో ఊహించని ఆతిథ్యం
-
ఎల్లలు దాటిన అనురాగం.. దాయాది దేశంలో ఊహించని ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో నివసించే శ్యాంసన్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. కుమార్తె తానియా సరాయ్ టెన్నిస్ క్రీడాకారిణి. ఈ నెల ప్రథమార్థంలో ఐటీఎఫ్–జే 5 టోర్నమెంట్ కోసం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌కు చెందిన సత్తయ్య, ఆయన కుమార్తె ప్రిన్సీతో కలిసి పాకిస్తాన్ వెళ్లారు. అక్కడి వారిని కలిసే వరకు మనసు నిండా ఎన్నో సందేహాలు, సంకోచాలు.. భయాలు. కాగా.. అక్కడ పర్యటించిన పక్షం రోజుల్లోనే వారి అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. పాకిస్థానీల వెలకట్ట లేని ప్రేమాభిమానాలతో ఉబ్బితబ్బిబ్బయ్యామని.. ఆ అనుభవాలను శ్యాంసన్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. అనుమానాలతో అడుగుపెట్టాం.. పాక్‌లో జరిగిన రెండు టోర్నమెంట్లలో తానియా, ప్రిన్సీ పాల్గొనాల్సి ఉండటంతో ఈ నెల 4న అక్కడకు చేరుకున్నాం. వాఘా సరిహద్దులో దౌత్య అధికారులు మాకు ధైర్యం చెప్పారు. అయినా మనసులో తెలియని భయం. అక్కడి వాళ్లు ఎలా ఉంటారో? వారి ప్రవర్తన ఎలా ఉంటుందో? మైండ్ సెట్స్ ఏమిటి? భారతీయులు అనగానే ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఇలా మనసులో అనేక సందేహాలతో బోర్డర్ దాటాం. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్లో బస చేశాం. అక్కడకు దాదాపు 20 కి.మీ దూరంలోని అడవిలో జిన్నా స్టేడియంలో టోర్నమెంట్. దీంతో ప్రతి రోజూ వెళ్లి రావాల్సి వచ్చేది. తాహెర్ ఖాన్‌తో అనుభవాలు మర్చిపోలేం... ఈ నెల 10న గేమ్ పూర్తయిన తర్వాత హోటల్‌కు తిరిగి వెళ్లడానికి క్యాబ్ కోసం ప్రయత్నించినా దొరకలేదు. దీంతో నిర్మానుష్యంగా ఉండే షకర్పరియర్ మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అదే సమయంలో ఇస్లామాబాద్‌కు చెందిన తాహెర్ ఖాన్ తన వాహనంలో వస్తుండగా లిఫ్ట్ అడిగాం. వెంటనే ఆపి మా నలుగరినీ ఆయన తన కారులో ఎక్కించుకున్నారు. మేం భారతీయులం అని తెలిసిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి మాట ‘వారె వాహ్’. హోటల్ దగ్గర దింపడానికి ముందు తన ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. కరాచీ, ఇస్లామాబా ద్, లాహోర్‌ల్లో ఎనిమిది రెస్టారెంట్లకు యజమాని అయిన తాహెర్ యూట్యూబర్, బ్లాగర్ కూడా. చదవండి: ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి.. పిల్లలతో ఆటలేంటి? I want my Indian friends & followers to watch this video. An Indian family who’re visiting Pakistan for his daughter’s tennis match in Islamabad. They met a good friend of mine Tahir Khan & asked for a lift. They’ve shared their experience in the video. This is Pakistan in real✌️ pic.twitter.com/S7VBrQawss — Ihtisham Ul Haq (@iihtishamm) November 8, 2022 విమర్శనూ పాజిటివ్‌గా.. పేదరికంలో ఉండీ పిల్లల భవిష్యత్తు కోసం అక్కడి వరకు వచ్చిన మమ్మల్ని చూసి మంత్రముగ్ధుడయ్యారు తాహెర్ ఖాన్. ఇస్లామాబాద్‌లోని తన రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి పాకిస్తానీ వంటకాలతో పాటు హైదరాబాద్ బిర్యానీ వడ్డించారు. భోజనం చేస్తున్నప్పుడే తాహెర్ మా పిల్లల్ని ఉద్దేశించి ఏ దేశ క్రీడాకారులతో తలపడుతున్నారని అడిగారు. పాకిస్థానీయులతోనే అని చెప్పగా... ఎవరు గెలుస్తారంటూ ప్రశ్నించారు. చివరకు గెలుపు మా చిన్నారులదే అయింది. భోజనం ముగిసిన తర్వాత హైదరాబాద్ బిర్యానీ రుచి వివరాలను ఆయన అడిగారు. మా దగ్గర లభించే దానికి ఏమాత్రం సరిపోదన్నాం. సగం మంది డబ్బు తీసుకోలేదు.. ఇస్లామాబాద్‌లో ఆటోలు లేకపోవడంతో 15 రోజుల టూర్లో భాగంగా అనేక క్యాబ్‌లు ఎక్కాం. వాటి డ్రైవర్లతో మాటల సందర్భంలో మేం భారతీయులమని చెప్పాం. దాదాపు సగం మంది డబ్బులు తీసుకోలేదు. -
ఒడిలో పడుకోబెట్టుకుని తల్లిలా ఓదార్చిన ‘కోతి’.. నెటిజన్లు ఫిదా!
బాధలో ఉన్న వ్యక్తిని ఎవరైనా దగ్గరకు తీసుకుని ఓదార్చితే మనసుకు ఎంతో హాయినిస్తుంది. మనకుంటూ ఒకరు ఉన్నారనే భావన కలుగుతుంది. అలాంటిది ఓ మనిషిని మూగజీవాలు అక్కున చేర్చుకుంటే ఆ దృశ్యం హృదయాన్ని కదిలిస్తుంది. అలాంటి పనే చేసి ఔరా అనిపించింది ఓ వానరం. బాధతో తలపట్టుకున్న ఓ వ్యక్తిని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఓదార్చింది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటనకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కోతి వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. అందులో.. లాగు, చొక్క ధరించిన ఓ కోతి సోఫాలో కూర్చుని ఉంటుంది. అక్కడికి ఓ వ్యక్తి ఒత్తిడిలో చికాకుపడుతూ తలపట్టుకుని వచ్చి వానరం పక్కన కూర్చున్నాడు. అది గమనించిన ఆ కోతి.. ఆ వ్యక్తిని పిలిచి తన ఒడిలో పడుకోవాలని సైగ చేస్తుంది. అతడు కోతి ఒడిలో తల వాల్చగా జోకొడుతూ చిన్న పిల్లలను నిద్రపుచ్చిన మాదిరిగా చేసింది. ఈ వీడియోను 30 లక్షల మందికిపైగా వీక్షించారు. కొందరు నెటిజన్లు ఆ వానరం తమకు కావాలంటూ కామెట్లు చేశారు. ‘ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితులకు ఆ తెలివైన వానరం నాకు అవసరం’ అని రాసుకొచ్చారు ఓ నెటిజన్. 452- Ağlayan arkadaşını dizine yatırıp teselli eden maymun pic.twitter.com/gezl0NKX8g— 59.748 farklı hayvan (@59748hayvan) July 30, 2022 ఇదీ చదవండి: ఏంది బ్రో అది: మొసలిని దగ్గరికి తీశాడు, ఆపై ఊహించని రీతిలో.. -
అద్దాలు తుడవటానికి వెళ్లి... రూ.12 లక్షలు
వాషింగ్టన్: మనిషి కష్టాన్ని చూసి సానుభూతి చూపించే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ ధైర్యంగా ముందుకు వచ్చి సాయం చేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అమెరికాలోని కనెక్టికట్‌లో మైక్ అనే వ్యక్తి తల దాచుకోవడానికి కూడా నిలువ నీడ లేని దుస్థితిలో ఉన్నాడు. 46 ఏళ్ల వయసున్న ఇతగాడు ఓ రోజు ఫిలిప్ వ్యూ అనే వ్లోగర్ కారు అద్దాలు తుడవడానికి వెళ్లాడు. అయితే అతడు అందుకు ససేమీరా అనడంతో చేసేదేం లేక బయట ఒంటరిగా దీనంగా కూర్చుండిపోయాడు. ఇది చూసిన ఫిలిప్ అతడి మీద జాలిపడి కారులోకి పిలిచి తినడానికి సాండ్విచ్ ఇచ్చాడు. నెమ్మదిగా మాటలు కలుపుతూ అతడి పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. అతడు ఎంతో కష్టకాలంలో ఉన్నాడని అర్థమైన ఫిలిప్ వారు మాట్లాడుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అతడి మాటల్లోనే తెలుసుకున్న నెటిజన్లు ఆయనకు ఎలాగైనా సాయం చేయాలనుకున్నారు. అలా ఎంతోమంది మైక్కోసం వేలాది డాలర్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో వీరి కోసం ఫిలిప్ 'గో ఫండ్ మీ' పేజ్ ఏర్పాటు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 10 వేల డాలర్లు పోగయ్యాయి. తాజాగా ఈ అమౌంట్ 17 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.12 లక్షలు)కు చేరింది. దీన్నంతటినీ ఫిలిప్ తక్కువ కాలంలోనే తనకు మంచి ఫ్రెండ్ అయిన మైక్‌కు అందజేసి ఆశ్చర్యపరిచాడు. ఆ డబ్బంతా ఇక నీ సొంతమని చెప్పడంతో క్షణకాలం పాటు నమ్మలేకపోయిన మైక్ ఆ వెంటనే కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన మైక్ కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాడట. ఏమైందో ఏమోకానీ తర్వాత తన కుటుంబానికి కూడా దూరమై ఒంటరిగా జీవిస్తున్నాడు. ఉండటానికి ఇల్లు కూడా లేని అతడి రియల్ లైఫ్ స్టోరీ విన్న నెటిజన్లు పెద్ద మనసుతో 12 లక్షల రూపాయలు ఇవ్వడంతో మైక్ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో టిక్‌టాక్‌లోనూ వైరల్‌గా మారింది. చదవండి: వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్ -
ఆ గిఫ్ట్ ఇవ్వగానే ఏడ్చేసిన వృద్ధుడు
ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.. ఉన్నంతకాలం మనిషి తన చుట్టూ జ్ఞాపకాలను కూడగట్టుకుంటాడు. దగ్గరివాళ్లను కోల్పోయాక వాటితోనే కాలం వెళ్లదీస్తాడు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా తన భార్యను కోల్పోయాడే కానీ ఆమె జ్ఞాపకాలను కాదు. బ్రిటీష్ యుద్ధంలో పాల్గొన్న కెన్ బెంబో అసిస్టెడ్ అనే వృద్ధుడు ఇంగ్లండ్‌లోని ప్రిస్టన్‌లో నివసిస్తున్నాడు. అతను ప్రతిరోజూ మంచంపై నిద్రకు ఉపక్రమించేముందు తన భార్య ఫొటోను కళ్లారా చూసుకునేవాడు. ఇది గమనించిన ఇద్దరు మహిళా కేర్‌టేకర్స్(వారి సంరక్షణ చూసుకునేవాళ్లు) అతన్ని సంతోషపెట్టాలనుకున్నారు. (ఇవి మొండి చిరుత పిల్లలు..) వెంటనే అతని భార్య ఫొటోను సంపాదించి దాన్ని దిండుపై ముద్రించి అతనికి బహుమతిగా ఇచ్చారు. అది చూసిన అతను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఊహించని బహుమతికి ఆనందభాష్పాలు రాల్చాడు. భార్య అదా గుర్తుకు వచ్చి తనివితీరా ఏడ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతనికి సంతోషాన్నందించిన కేర్టేకర్లను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. "ఇది నా మనసును చలింపజేసింది", "ఇది చూస్తున్నంతసేపు నాకు తెలీకుండానే కన్నీళ్లు వస్తున్నాయి" అంటూ ఎమోషనల్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!) -
ఆ గిఫ్ట్ ఇవ్వగానే ఏడ్చేసిన వృద్ధుడు
-
హార్ట్ టచింగ్ వీడియో.. చూస్తే ఎమోషనలే..
బీజింగ్ : 'భార్యభర్తలంటే ఇలా ఉండాలి' అనేలా సోషల్ మీడియాలో హృదయాన్ని ద్రవింప జేసే ఓ వీడియో పరుగులు పెడుతోంది. దానిని చూసిన వారంతా ఆశ్చర్యపోవడంతోపాటు కళ్లు చెమరుస్తున్నారు. చైనాకు చెందిన ఓ పెద్దాయన తన భార్యను వీపు మీద మోసుకొని వెళ్లడమే ఆ వీడియోలో ఉన్న అంశం. అందులో ఏముందంటే చైనాలోని రోడ్డుపై భారీ వరద నీరు వెళుతుండగా వాహనాలు సైతం అతి జాగ్రత్తగా వెళుతున్నాయి. అదే సమయంలో ఓ వృద్ధ దంపతులు రోడ్డు దాటాల్సి వచ్చింది. దాంతో దాదాపు కర్రపట్టుకొని నడిచే వయసులో ఉన్న ఆ పెద్దాయన తన ప్యాంటును పైకి మడుచుకొని ఎంతో ధైర్యంగా తన భార్యను వీపు మీదకు ఎక్కించుకొని దాదాపు మొకాలి వరకు వచ్చిన నీటిలో కాస్త తడబడుతూ, వణుకుతూ మెల్లిగా అడుగులు వేసుకుంటూ సురక్షితంగా రోడ్డు దాటాడు. హార్ట్‌ను టచ్ చేసేలా ఉన్న ఈ దృశ్యాన్ని ఎవరో వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది.