హార్ట్‌ టచింగ్‌ వీడియో.. చూస్తే ఎమోషనలే.. | Heartwarming Video Shows Elderly Man Carrying Wife On Back | Sakshi
Sakshi News home page

హార్ట్‌ టచింగ్‌ వీడియో.. చూస్తే ఎమోషనలే..

Published Wed, Sep 13 2017 2:19 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Heartwarming Video Shows Elderly Man Carrying Wife On Back



బీజింగ్‌ : 'భార్యభర్తలంటే ఇలా ఉండాలి' అనేలా సోషల్‌ మీడియాలో హృదయాన్ని ద్రవింప జేసే ఓ వీడియో పరుగులు పెడుతోంది. దానిని చూసిన వారంతా ఆశ్చర్యపోవడంతోపాటు కళ్లు చెమరుస్తున్నారు. చైనాకు చెందిన ఓ పెద్దాయన తన భార్యను వీపు మీద మోసుకొని వెళ్లడమే ఆ వీడియోలో ఉన్న అంశం. అందులో ఏముందంటే చైనాలోని రోడ్డుపై భారీ వరద నీరు వెళుతుండగా వాహనాలు సైతం అతి జాగ్రత్తగా వెళుతున్నాయి. అదే సమయంలో ఓ వృద్ధ దంపతులు రోడ్డు దాటాల్సి వచ్చింది.

దాంతో దాదాపు కర్రపట్టుకొని నడిచే వయసులో ఉన్న ఆ పెద్దాయన తన ప్యాంటును పైకి మడుచుకొని ఎంతో ధైర్యంగా తన భార్యను వీపు మీదకు ఎక్కించుకొని దాదాపు మొకాలి వరకు వచ్చిన నీటిలో కాస్త తడబడుతూ, వణుకుతూ మెల్లిగా అడుగులు వేసుకుంటూ సురక్షితంగా రోడ్డు దాటాడు. హార్ట్‌ను టచ్‌ చేసేలా ఉన్న ఈ దృశ్యాన్ని ఎవరో వ్యక్తి రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement