ఒడిలో పడుకోబెట్టుకుని తల్లిలా ఓదార్చిన ‘కోతి’.. నెటిజన్లు ఫిదా! | A Monkey Comforted A Man Who Broke Down In A Viral Video | Sakshi
Sakshi News home page

బాధలో ఉన్న వ్యక్తిని తల్లిలా ఓదార్చిన కోతి.. నెటిజన్లు ఫిదా!

Published Wed, Aug 3 2022 7:06 PM | Last Updated on Wed, Aug 3 2022 7:11 PM

A Monkey Comforted A Man Who Broke Down In A Viral Video - Sakshi

బాధలో ఉన్న వ్యక్తిని ఎవరైనా దగ్గరకు తీసుకుని ఓదార్చితే మనసుకు ఎంతో హాయినిస్తుంది. మనకుంటూ ఒకరు ఉన్నారనే భావన కలుగుతుంది. అలాంటిది ఓ మనిషిని మూగజీవాలు అక్కున చేర్చుకుంటే ఆ దృశ్యం హృదయాన్ని కదిలిస్తుంది. అలాంటి పనే చేసి ఔరా అనిపించింది ఓ వానరం. బాధతో తలపట్టుకున్న ఓ వ్యక్తిని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఓదార్చింది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటనకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

కోతి వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది. అందులో.. లాగు, చొక్క ధరించిన ఓ కోతి సోఫాలో కూర్చుని ఉంటుంది. అక్కడికి ఓ వ్యక్తి ఒత్తిడిలో చికాకుపడుతూ తలపట్టుకుని వచ్చి వానరం పక్కన కూర్చున్నాడు. అది గమనించిన ఆ కోతి.. ఆ వ్యక్తిని పిలిచి తన ఒడిలో పడుకోవాలని సైగ చేస్తుంది. అతడు కోతి ఒడిలో తల వాల్చగా జోకొడుతూ చిన్న పిల్లలను నిద్రపుచ్చిన మాదిరిగా చేసింది. ఈ వీడియోను 30 లక్షల మందికిపైగా వీక్షించారు. కొందరు నెటిజన్లు ఆ వానరం తమకు కావాలంటూ కామెట్లు చేశారు. ‘ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితులకు ఆ తెలివైన వానరం నాకు అవసరం’ అని రాసుకొచ్చారు ఓ నెటిజన్‌.

ఇదీ చదవండి: ఏంది బ్రో అది: మొసలిని దగ్గరికి తీశాడు, ఆపై ఊహించని రీతిలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement