Cat Kids
-
రెండు తలలతో జన్మించిన పిల్లి.. మురిసిపోతున్న యజమాని!
బ్యాంకాక్: ఇదేమిటో తెలుసా? పిల్లి కూన. అయితే అల్లాటప్పా కూన కాదు. ఏకంగా రెండు తలలతో పుట్టిన కూన! ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటల కంటే బతకవు. కానీ ఆదివారం థాయ్‌లాండ్‌లో పుట్టిన ఈ కూన మాత్రం భేషుగ్గా బతికేసింది. పైగా రెండు మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ యజమాని మురిసిపోతున్నాడు. దీనికి టుంగ్ గ్రెన్ (వెండి బ్యాగు), టుంగ్ టోంగ్ (బంగారు బ్యాగు) అని ఏకంగా రెండు పేర్లు కూడా పెట్టుకున్నాడు. ఒక్కో తలకు ఒక్కో పేరన్నమాట! దీని తల్లి ముందుగా ఒక మామూలు కూనను కనింది. తర్వాత రెండో కాన్పు కష్టంగా మారడంతో హుటాహుటిన స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారట. వాళ్లు సిజేరియన్ చేసి ఈ అరుదైన రెండు తలల కూనను విజయవంతంగా బయటికి తీశారు. దాంతో యజమాని ఆనందంలో మునిగిపోయాడు. ‘‘చనిపోతుందేమోనని ముందుగా భయపడ్డా. అలాంటిదేమీ జరక్కపోవడంతో నా ఆనందం రెట్టింపైంది’’ అని చెప్పుకొచ్చాడు. రెండు తలల పిల్లుల్ని రెండు తలల రోమన్ దేవత జానస్ పేరిట జానస్ క్యాట్స్ అని పిలుస్తారు. ఫ్రాంక్ అండ్ లూయీదే గిన్నిస్ రికార్డు ఏకంగా 15 ఏళ్లు బతికిన రెండు తలల పిల్లి ఇది! దీని పేరు ఫ్రాంక్ అండ్ లూయీ. 1999లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో పుట్టింది. అత్యధిక కాలం బతికిన జానస్ క్యాట్‌గా 2012లోనే ఇది గిన్నిస్ బుక్కులోకి ఎక్కింది. అన్నట్టూ, ఇది మూడు కళ్లతో పుట్టడం విశేషం. ఇదీ చదవండి: ఆ పిల్లి... కోలుకుంటోంది! -
వైరల్ : తల్లి వద్దనుకుంది.. డాక్టరే అన్నీ అయి
-
వైరల్ : రెండు ముఖాల పిల్లి.. తల్లి వద్దన్నా
రెండు ముఖాలతో పుట్టిన నాలుగు నెలల పిల్లి తన సోదరులతో కలిసి ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్ రాల్ఫ్ ట్రాన్ చెందిన క్లినిక్‌లో ఒక పిల్లి నాలుగు నెలల క్రితం పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక్కటి మాత్రం మిగతావాటి కంటే బిన్నంగా రెండు ముఖాలతో పుట్టడంతో తల్లి దానిని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్ దానిని పెంచుకోవాలనుకొని భావించి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి డుయో అని పేరు పెట్టాడు. కాగా, ఆ పిల్లి డిప్రోసోపస్, క్రానియోఫేషియల్ డూప్లికేషన్ అనే అరుదైన లోపం ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. ఇది పుట్టుకతోనే వచ్చే లోపం అని శరీర అవయవాలు అన్నీ ఒకటిగా ఉన్నా ముఖాలు మాత్రం రెండుగా ఉంటాయి. అయితే ముక్కు,నోరు మాత్రం యధావిధిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా రాల్ఫ్ ట్రాన్ ... డుయో తన సోదరులైన టైనీ టూనా, డాబీలతో కలిసి ఆడుకుంటున్న ఫోటోలతో పాటు వీడియోనూ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అంతే అది చూసిన ప్రతీ ఒక్కరూ డాక్టర్ చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. 'వికృత రూపంతో పుట్టిన ఆ పిల్లిని తల్లి కాదన్న మీరు దానిని చేరదీసి ఆరోగ్యవంతంగా తయారు చేశారంటూ' పలువురు నెటిజన్లు ప్రశంసించారు. 'డుయో పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉండడంతో అది ఎక్కువ రోజులు బతకదేమో అనుకున్నా. జన్మనిచ్చిన తల్లి కాదన్న ఎలాగైనా బతకాలన్న ఆ పిల్లి పట్టుదల, మనోస్థైర్యమే ఈరోజు దానిని ఆరోగ్యవంతంగా మార్చిందని' డాక్టర్ రాల్ఫ్ ట్రాన్ పేర్కొన్నారు. -
తల్లిప్రేమ!
ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే... అంటుంటారు. ఇది మనుషులకే కాదు పిల్లులకూ వర్తిస్తుంది. పిల్లి పిల్లలు బాధతో అరుస్తుంటే... మనకు బాధగా ఉంటుంది. మరి మనకే ఇలా ఉంటే వాటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రులలో ఎవరు ఎక్కువగా స్పందిస్తారు? ఈ విషయంపై హానోవర్ మెడికల్ స్కూల్, జర్మన్ పరిశోధకులు లోతుగా పరిశోధించారు. ఇందులో వారు చెప్పిన కీలక విషయం ఏమిటంటే... పిల్లల అరుపులు వినిపించగానే మగపిల్లులతో పోల్చితే ఆడపిల్లులు పదింతలు వేగంగా స్పందిస్తాయట!