Anand Mahindra Shares Video Of Orangutan Feeding Tiger Cubs, Goes Viral - Sakshi
Sakshi News home page

Anand Mahindra:మరో అడోరబుల్‌ వీడియో వైరల్‌

Published Sun, Aug 7 2022 4:01 PM | Last Updated on Sun, Aug 7 2022 6:05 PM

Anand Mahindra Shares Adorable Video Of Orangutan Feeding Tiger Cubs - Sakshi

సాక్షి, ముంబై: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేశారు.  ట్విటర్‌లో ఆకర్షణీయమైన పో'స్టులు, ఆసక్తిరమైన వీడియోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే  ఆయన ఈ వీకెండ్‌లో  మరో ఇంట్రస్టింగ్‌ వీడియోను  పోస్ట్‌ చేశారు. ఒక్కోసారి పిల్లలు వేరే జాతివాళ్లా... అనిపిస్తుంది. ఏది ఏమైనా పిల్లలంటే పిచ్చి ప్రేమే అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. (కెనడాలో ఉద్యోగం కావాలా? 10 లక్షలపైగా ఖాళీలు..ఇంకా పెరగొచ్చు!)

ఈ వీడియోలో ఒరంగుటాన్‌ పులి పిల్లలకు పాలు పట్టడం, ముద్దు చేయడం కన్నతల్లి కంటే మిన్నగా ప్రేమను పంచడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో అమ్మ ఎక్కడైనా  అ‍మ్మే అని కొంతమంది,  జంతువులనుంచి మనుషుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని మరికొంతమంది కమెంట్‌ చేశారు.  ప్రస్తుతం నెట్టింట  చక్కర్లు  కొడుతున్న చక్కటి ఈ వీడియోను ఈ వీకెండ్‌లో మీరు కూడా చూసేయండి. 

(Hyderabad Student Vedant Anandwade: హైదరాబాదీకి బంపర్‌ ఆఫర్‌..సుమారు కోటిన్నర స్కాలర్‌షిప్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement