orangutan
-
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్‌లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు. -
ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన మరో అడోరబుల్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ట్విటర్లో ఆకర్షణీయమైన పో'స్టులు, ఆసక్తిరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ఆయన ఈ వీకెండ్లో మరో ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఒక్కోసారి పిల్లలు వేరే జాతివాళ్లా... అనిపిస్తుంది. ఏది ఏమైనా పిల్లలంటే పిచ్చి ప్రేమే అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. (కెనడాలో ఉద్యోగం కావాలా? 10 లక్షలపైగా ఖాళీలు..ఇంకా పెరగొచ్చు!) ఈ వీడియోలో ఒరంగుటాన్ పులి పిల్లలకు పాలు పట్టడం, ముద్దు చేయడం కన్నతల్లి కంటే మిన్నగా ప్రేమను పంచడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో అమ్మ ఎక్కడైనా అమ్మే అని కొంతమంది, జంతువులనుంచి మనుషుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని మరికొంతమంది కమెంట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న చక్కటి ఈ వీడియోను ఈ వీకెండ్లో మీరు కూడా చూసేయండి. (Hyderabad Student Vedant Anandwade: హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్) Sometimes you feel like your kids belong to a different species but you’re crazy about them nevertheless! 😊 pic.twitter.com/rD9IGohPQq — anand mahindra (@anandmahindra) August 7, 2022 -
గొరిల్లా పట్టు మాములుగా లేదుగా...కొద్దిలో సేఫ్ లేదంటే...
ఇటీవల సందర్శకులు జూలకు వెళ్లి అక్కడ ఉన్న జంతువులతో లేనిపోనీ కష్టాలు కొనితెచ్చుకున్న సంధార్భాలు అనేకం. జూ అధికారులు సైతం ప్రమాదకరమైన జంతువుల సమీపంలోకి వెళ్లొద్దు అని హెచ్చరిక బోర్డులు పెట్టినా కూడా లెక్కచేయకుండా వెళ్లి పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని క్రూర జంతువులు దగ్గరకు వెళ్లేటప్పుడు జంతు సంరక్షక్షులు చెప్పే సూచనలు పాటించాలి లేదంటే ఆ జంతువుల దాడికి బలైపోక తప్పదు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అదృష్టం కొద్ది బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని కసాంగ్ కులిమ్ జూలో టీనా అనే గొర్రిల్లా బోనులో బంధించి ఉంది. హసన్ అరిఫిన్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఈ జూని సందర్శించడానికి వెళ్లాడు. ఐతే అతను ఈ టీనా అనే గొర్రిల్లా బోను వద్దకు ఇచ్చి రెండు చేతుల ఇచ్చి సరదాగా రా అన్నాడు. అంతే అది ఒక్కసారిగా అతన్ని కోపంగా పట్టుకోవడానికి రెడీ అయిపోయింది. అక్కడి అతను దూరంగానే ఉన్నాడు. ఐతే ఆ గోర్రిల్లా మాత్రం ఆ వ్యక్తి చొక్కాను పట్టుకుని బోనులోకి లాగేందుకు ట్రై చేస్తోంది. సహయం కోసం హసన్ తన స్నేహితుడిన పిలిచాడు. అతని స్నేహితుడు సైతం తన ఫ్రెండ్‌ని కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఆ గొర్రిల్లా అతని కాలుని కదలకుండా ఉడుం పట్టు పట్టేసింది. ఇక ఎలాగోలాగా బలవంతంగా ఆ గొర్రిల్లా ఉడుంపట్టు నుంచి లాగేందుకు శతవిధాల ప్రయత్నిస్తూంటే అది ఆ వ్యక్తిని కూడా పక్కకు తోసేసింది. చివరికి హసన్ తన కాలుని గొర్రిల్లా కొరకబోతుందనగా కొద్ది సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. pic.twitter.com/6yhHjvDjgT — san (@sundaykisseu) June 7, 2022 (చదవండి: ఇక రాను రాను టమాటా కెచప్ తయారు చేయకపోవచ్చు!) -
అబ్బురపరిచిన వానరం!
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అనే మంచిమాటను మనుషులు మర్చిపోతున్న పరిస్థితి. ఇక జంతువుల విషయానికొస్తే ఆపదను తెచ్చిపెట్టేవి అవే అయినా.. కొన్నిసార్లు ఆపద నుంచి రక్షించేవి కూడా అవే. ఈ క్రమంలో ఒరాంగుటాన్ అనే జంతువు మనిషి ప్రమాదంలో ఉన్నాడని భావించి అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చి అందరినీ అబ్బురపరిచిన ఘటన బొర్నియాలో చోటు చేసుకుంది. బోలెడు తెలివి తేటలుండే ఒరాంగుటాన్ అనే వానరం కొన్ని విషయాల్లో మనిషిలాగే ప్రవర్తిస్తాయన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. తాజాగా బొర్నియా ప్రాంతంలో సంచరిస్తున్నన ఒరాంగుటాన్ బురద నీటిలో సగం వరకు మునిగి ఉన్న ఓ వ్యక్తిని గమనించి అతను ఆపదలో ఉన్నాడని భావించింది. వెంటనే అతన్ని సమీపించి చేయి చాచి సహాయం అందించింది. దీన్ని అనిల్ ప్రభాకర్ అనే వ్యక్తి ఫొటో తీయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతరించిపోతున్న జీవజాతుల కోసం పనిచేస్తున్న ‘బొర్నియో ఒరాంగుటాన్ సర్వైవల్ ఫౌండేషన్’ అనే సంస్థ ఈ అద్భుతమైన ఫొటోను గురువారం తమ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ‘మనుషుల్లో అడుగంటిపోతున్న మానవత్వాన్ని కొన్ని జంతువులు మనకు గుర్తు చేస్తున్నాయి’ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటో ఎంతోమంది నెటిజన్ల హృదయాలను కరిగిస్తోంది. ‘ఆ జంతువు చూపిన ప్రేమకు మేం దాసోహమయ్యాం’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పైన చెప్పుకున్న ఫౌండేషన్‌లో పని చేస్తాడు. కాగా ఆ నదిలో పాముందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని దాని కోసం వెదికానని ఆయన పేర్కొన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒరాంగుటాన్ తాను ప్రమాదంలో ఉన్నానని భ్రమించి సహాయం చేయడానికి వచ్చిందని తెలిపాడు. అయితే అది అడవు జంతువు కాబట్టి, దాని సహాయాన్ని తిరస్కరించానని తెలిపాడు. (మీ పిడకల వేట అదుర్స్) -
ఇలా దమ్ము కొట్టగలరా?.. వైరల్ వీడియో
బాండుంగ్ (ఇండోనేషియా) : అది ఇండోనేషియాలోని ఓ జూపార్క్. వివిధ రకాల జంతువులను చూసేందుకు వచ్చిన ఔత్సాహికుల్లో ఒకరు సిగరెట్ తాగుతూ ఒరాంగ్టాంగ్ ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. కొద్దిసేపు ఒరాంగ్టాంగ్ను తదేకంగా చూసిన ఆ వ్యక్తి తాను తాగుతున్న సిగరెట్‌ను దాని ఎదురుగా విసిరేశాడు. అది వెంటనే దాన్ని తీసుకొని మగరాయుళ్లెవరూ కూడా తాగలేనంత స్టైల్‌గా సిగరెట్ తాగింది. గుప్పుగుప్పుమంటూ పొగను ముక్కల్లో నుంచి కూడా బయటకు తీసింది. ఓ కెమెరా కంటికి చిక్కిన ఆ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో పెద్ద వైరల్‌గా మారింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరీ.. -
స్టైల్‌గా సిగరెట్ తాగింది..!
-
బిడ్డ కోసం అపర కాళిలా..!
తన బిడ్డకు అపాయం వస్తోందంటే.. తల్లి ఊరుకుంటుందా? అపరకాళిలా మారి ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కదూ. మనుషులే కాదు.. కోతులు కూడా అలాగే చేస్తాయని మరోసారి రుజువైంది. బోర్నియా ప్రాంతంలోని అడవుల్లో ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిద్దామని వెళ్లి రష్యా ఫొటోగ్రాఫర్ జూలియా సుండుకోవాకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కోతి జాతికి చెందిన ఒరాంగుటాన్.. తన బిడ్డ మీదకు ఓ అడవిపంది వస్తుంటే దాన్ని కర్రతో తరిమి తరిమి కొట్టింది. పిల్ల ఒరాంగుటాన్ మీద దాడి చేద్దామని వచ్చిన అడవిపందిని చూసి... తల్లి వెంటనే అడవిలో ఉన్న కట్టెపుల్ల తీసుకుని.. అడవిపంది ముఖం మీద కొట్టింది. దాన్ని తరిమి కొట్టేందుకు తనకు చేతనైన అన్ని ప్రయత్నాలు చేసింది. పెద్దపెద్దగా అరుస్తూ దాన్ని కర్రతో భయపెడుతూ చెట్టు కొమ్మలను విరిచి దాని మీద వేయడం మొదలుపెట్టింది. ఈ దృశ్యాలన్నింటినీ రష్యా ఫొటోగ్రాఫర్ చకచకా తన కెమెరాలో బంధించారు. ఆ తల్లి ఒరాంగుటాన్ దెబ్బకు భయపడిన అడవిపంది.. ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుంటూ అక్కడి నుంచి చల్లగా జారుకుంది.