
మృతిచెందిన గొర్రెపిల్లలను చూపుతున్న ఆశన్న
కోడేరు (కొల్లాపూర్): కుక్కల దాడిలో 15 గొర్రెపిల్లలు మృతిచెందాయి. ఈ సంఘటన మండలంలోని కొండ్రావుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుందేళ్ల ఆశన్న సోమవారం తనకున్న గొర్రెలను మేత కోసం పొలానికి తీసుకెళ్లాడు. 15 చిన్న గొర్రె పిల్లలు ఉండటంతో వ్యవసాయ పొలంలో జల్ల కింద ఆపాడు. సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి గొర్రెపిల్లలను కుక్కలు పీక్కుతిన్నాయని బాధితుడు వాపోయాడు.
ఈ ప్రమాదంలో దాదాపు రూ.60 వేల ఆస్తినష్టం జరిగిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వీఆర్‌ఓ నారాయణ అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బాధితునికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి రూ.5 వేల ఆర్థికసాయం అందించినట్లు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, కోడేరు మండల పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణయాదవ్, బాలచంద్రయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment