సాధ్యమైనంత వరకు బిడ్డకు తల్లిపాలే పట్టాలి. నిజానికి అవే చాలా మంచివి. అయితే తల్లికి పాలు పడని సందర్భాల్లో మాత్రం పోత పాలు ఇవ్వవచ్చు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.
►పాడి పశువుల పాలు : ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు.
►డబ్బా పాలు : పిల్లల కోసం ఉద్దేశించి అమ్మే పాల పౌడర్‌ను ఉపయోగించి కలిసి ఇచ్చేవి. పాడి పశువుల పాలైనా లేదా డబ్బాపాలైనా సీసా సహాయంతో ఇస్తారు. ఇలా సీసాతో పాలు పట్టాల్సివచ్చినప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి...
►ముందుగా సీసాను, పాల పీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి.
►పాల సీసాను పదినిమిషాల పాటు మరిగే నీళ్లలో ఉంచాలి. అలాగే పాల పీకను కనీసం రెండు నిమిషాల పాటు వెడి నీళ్లలో మరగనివ్వాలి.
►బిడ్డకు పాలు పట్టే సమయంలో సరైన విధంగా పట్టాలి.
►అంటే బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు ఇవ్వాలి. అలాగే.. పాలు పట్టాక బిడ్డను వెంటనే పడుకోబెట్టకూడదు.
►పాలు పట్టగానే బిడ్డను మొదట భుజంపై వేసుకుని నెమ్మదిగా తట్టాలి. ఇలా తేన్పు వచ్చే వరకు తట్టాలి.
►సీసాలో పాలు తాగించే సమయంలో ఒకసారి తాగాక మిగిలిన పాలను తప్పక పారబోయాలి.
►బిడ్డ నిద్రపోయే సమయంలో పాలు తాగించకూడదు.
పసిబిడ్డకు సీసాతో పాలు పడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Published Thu, Mar 11 2021 4:02 PM | Last Updated on Thu, Mar 11 2021 4:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment