బిడ్డకు ఎప్పుడూ తల్లి పాలు పట్టడమే చిన్నారికి మేలు చేస్తుంది. కేవలం తల్లికి పాలు పడని సందర్భాల్లో మాత్రమే ΄ోత ΄ాలు పట్టాలి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.
పాడి పశువుల పాలు: ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు.
డబ్బా పాలు: మార్కెట్లో అమ్మే పిల్లల కోసం ఉద్దేశించిన పాల ΄పోడర్‌ను ఉపయోగించి కలిపి ఇచ్చేవి. గేదె వంటి ΄ాడి పశువుల ΄ాలైనా / డబ్బాపాలైనా సీసాలో పాసి తాగిస్తారు. సీసాతో పాలు పట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
సీసానూ, పాలపీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. కడిగాక పాల సీసాను పదినిమిషాలు మరిగే నీళ్లలో ఉంచాలి. ΄ాల పీకనూ కనీసం రెండు నిమిషాల పాటు వెడి నీళ్లలో ఉంచాలి. బిడ్డకుపాలు పట్టిన వెంటనే పక్కమీద పడుకోబెట్టకూడదు. మొదట బిడ్డను భుజంపై వేసుకుని వీపుపై నెమ్మదిగా తడుతూ ఉండాలి. తేన్పు వచ్చే వరకు ఇలా చేయాలి.
ఒకసారి తాగాక సీసాలో మిగిలిన పాలను పారబోయాలి. నిద్రపోయే సమయంలో బిడ్డకు పాలు తాగించకూడదు. పాలు తాగించే సమయంలో బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు పట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment