
అమెరికాకు చెందిన డేవ్ బెన్నెట్ అతి పెద్ద వంకాయను పండించి గిన్ని స్ వర్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ వంకాయ ఆశ్చర్యపరిచే విధంగా ఏకంగా 3.778 కేజీల బరువు ఉంది. సుమారు 16 అడుగుల పొడవు, 35 సెంటిమీటలర్ల చుట్టుకొలతతో ఉంది. జూలై 31న అయోవాలోని బ్లూమఫీల్డ్లో ఇంత పెద్ద భారీ వంకాయ కాసినట్లు గుర్తించాడు.
ఇది సాధారణ మార్కెట్లలో పండించే వంకాయ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంది. ఈ వంకాయకి సంబంధించిన విత్తనాలను ఏప్రిల్‌లో నాటినట్లు తెలిపాడు. జూలై నాటికి కాయడం ప్రారంభించిందని వివరించాడు. అంతేగాదు ఇదే ప్రపంచంలోనే అత్యంత భారీ వంకాయ అని గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకటించింది. ఈ అద్భుతమైన వంకాయను ప్రపంచ రికార్డుల జాబితాలో చేర్చుతున్నందుకు సంతోషంగా ఉందని అధికారులు తెలిపారు. అందుకు సంబంధంచిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ఆ దేశంలో జీన్స్ బ్యాన్..పొరపాటున ధరిస్తే అంతే సంగతులు..!)
Comments
Please login to add a commentAdd a comment