
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్ రాజశేఖర్. ఈ చిన్నారికి చెస్ అంటే ఇష్టం.
తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్‌లలో చెస్‌బోర్డ్‌పై అత్యంత వేగంగా 32 పావులను సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment