
అగ్గిపెట్టె సైజులో రాసిన భగవద్గీత
కళ్యాణదుర్గం: బియ్యపు గింజలు... సుద్దముక్కలు.... సబ్బు బిళ్లలు... పెన్సిళ్లు... కాదేదీ కళకు అనర్హం అన్నట్టు తన సూక్ష్మ కళతో ఆర్టీసీ కండక్టర్ వివేకానంద అద్భుత చిత్రాలు ఆవిష్కరిస్తున్నారు. అక్షరాలను సూక్ష్మంగా రాస్తూ మైక్రో ఆర్టిస్ట్‌గా అవతారమెత్తి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. దోస కాయ విత్తనాలతో పాటు బియ్యం గింజలపై 189 తెలుగు అక్షరాలు, వందేమాతర గీతం, వేమన పద్యాలు రాసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. దోసకాయ విత్తనాలపై గాంధీ, మూత్ర పిండాల వ్యవస్థ, తాజ్‌మహల్, ఏసు శిలువ, పడవ, గుడిసె తదితర బొమ్మలను చిత్రీకరించారు.
బియ్యపు గింజపై సెలవుచీటి రాసి అందరినీ అబ్బురపరిచారు. సుద్దముక్కపై సైన్స్‌కు సంబంధించిన అనేక అంశాలతో పాటు జంతువుల బొమ్మలూ వేశారు. అగ్గిపుల్ల, నారుపోగులపై ఏ నుంచి జడ్ వరకూ ఆంగ్ల అక్షరాలు లిఖించి ఆకట్టుకున్నారు. అలాగే పురాతన నాణేల సేకరణపై సైతం మక్కువ పెంచుకున్న ఆయన ఇప్పటి వరకూ భారతదేశంతో పాటు బెల్జీయం, జర్మనీ, ఆప్ఘనిస్తాన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలకు చెందిన సుమారు 300కు పైగా నాణేలు సేకరించారు.
గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకునేలా
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన ఎం.వివేకానంద కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు. 1995లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే సూక్ష్మ కళతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో చోటు దక్కించుకోవచ్చునని తెలుసుకున్న వివేకానంద తాను కూడా మైక్రో ఆర్టిస్ట్‌గా రాణించాలని భావించారు. అప్పటి నుంచి తన సాధనను మొదలు పెట్టిన ఆయన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో పోస్టుకార్డుపై 2,058 ఇంగ్లిష్ అక్షరాలతో ‘జై సమైక్యాంధ్ర’ అనే నినాదాన్ని ఏపీ చిత్ర పటం ఆకారంలో లిఖించారు.
అగ్గిపుల్లలపై జై సమైక్యాంధ్ర నినాదాన్ని 76 అక్షరాలతో, బియ్యపు గింజపై 14 అక్షరాలతో రాశారు. ప్రస్తుతం ఆయన అగ్గిపెట్టెలో పట్టేంత చిన్నపాటి పుస్తకంలో భగవద్గీత రాస్తున్నారు. ఇప్పటి వరకూ 9 పర్వాలు పూర్తయ్యాయి. కాగా, 2 సెం.మీ. వెడల్పు, 3 సెం.మీ. పొడవు పరిమాణంలో ఉన్న పుస్తకంలో మాత్రమే భగవద్గీత రాసినట్లుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఉంది. ఈ రికార్డును అధిగమించేలా 1.8 సెం.మీ. వెడల్పు, 2.8 సెం.మీ. పొడవు (అగ్నిపెట్టె) పరిమాణంలో ఆయన భగవద్గీత రాస్తూ గత రికార్డును బద్ధలుగొట్టే దిశగా ప్రయత్నిస్తూనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్‌కు చేరువయ్యారు.
గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంటా
మనసుంటే మార్గం ఉంటుంది అనే నమ్మకంతో ముందుకు పోతున్నా. ఇప్పటి వరకూ దోస విత్తనాలు, బియ్యపు గింజలపై ప్రముఖుల చిత్రాలతో పాటు సైన్స్‌కు సంబంధించిన అంశాలను చిత్రీకరించాను. ప్రస్తుతం అగ్గిపెట్టెలో పట్టేంత పరిమాణమున్న పుస్తకంలో భగవద్గీత రాస్తున్నా. ఎలాగైనా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో చోటు దక్కించుకుంటా.
– ఎం.వివేకానంద, ఆర్టీసీ కండక్టర్

దోసకాయ విత్తనంపై చిత్రీకరించిన మూత్రపిండ వ్యవస్థ

Comments
Please login to add a commentAdd a comment