పలు రైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు
గుంతకల్లు: పెనుకొండ–మక్కాజీపల్లి మధ్య జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు–హిందూపురం ప్యాసింజర్ రైలు (77213)ను ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు, హిందూపురం–గుంతకల్లు ప్యాసింజర్(77214)ను ఈ నెల 26 నుంచి 28 వరకు రద్దు చేశామన్నారు. బెంగళూరు–ధర్మవరం (06595/60) ప్యాసింజర్లు హిందూపురం–ధర్మవరం మధ్య ఈనెల 25 నుంచి 28 వరకు తిరగవని, కేవలం బెంగళూరు–హిందూపురం మధ్య రాకపోకలు సాగిస్తాయన్నారు. అహ్మదాబాద్–యశ్వంత్‌పూర్ (22689) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 25న వయా ధర్మవరం–పెనుకొండ–హిందూపురం మధ్య మళ్లించామన్నారు. కలబురిగి–బెంగుళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (22231)ను ఈ నెల 25 నుంచి 27 వరకు అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, యలహంక మీదుగా, కాచిగూడ–యశ్వంత్‌పూర్ (20703)ను ఈ నెల 25 నుంచి 28 వరకు ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ మీదుగా, హుబ్లీ–మైసూర్ (16591), కాచిగూడ– మైసూర్ (12785), నాంధేడ్–బెంగళూరు (16594) ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 26,27వ తేదీల్లో ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ మీదుగా దారి మళ్లించినట్లు వివరించారు. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పేదోడి రైళ్లు మరో వారం
రోజులు తిరగవ్!
రాయలసీమ జిల్లాల మీదుగా రాకపోకలు సాగిస్తూ పేదోడి రైళ్లుగా పేరుగాంచిన పలు ప్యాసింజర్‌లు మరో వారం రోజులు తిరగవు. కుంభమేళాను పురస్కరించుకుని ఈ రైళ్లను ఫిబ్రవరి 28 వరకూ రద్దు చేశారు. తాజాగా మరో వారం పాటు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి–కదిరిదేవరపల్లి (57406) ప్యాసింజర్ మార్చి 7 వరకు, కదిరిదేవరపల్లి–తిరుపతి (57405) ప్యాసింజర్ మార్చి 8 వరకు రాకపోకలు సాగించవన్నారు. అలాగే, గుంతకల్లు–తిరుపతి(57404)ప్యాసింజర్ మార్చి 7 వరకు, తిరుపతి–గుంతకల్లు (57403) రైలు మార్చి 8 వరకూ, తిరుపతి–హుబ్లీ (57402) మార్చి 7 వరకు, హుబ్లీ–తిరుపతి (57401) ప్యాసింజర్ మార్చి 8 వరకు తిరగవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment