చికెన్ తినే పోటీ అనగానే నిమిషంలో కోడిని మొత్తం లాగించే వారిని మీరు చూసి ఉంటారు.. కానీ కేవలం చికెన్ కాళ్లు తినే పోటీని మీరెప్పుడైనా చూశారా? ఉడకబెట్టిన కోడి కాళ్లను.. అది కూడా నిమిషం వ్యవధిలో తినే పోటీ గురించి విన్నారా? ఎందుకంటే ఎముకలతో కూడిన కోడి కాళ్లను తినడం అంటే మామూలు విషయం కాదు. వాటిని కాల్చిన పద్ధతిని బట్టి రుచి మారుతుంది. అలాంటిది దక్షిణాఫ్రికాకు చెందిన వుయోల్వెతు సిమనైల్ అనే యువతి కేవలం 60సెకన్లలో ఏకంగా మూడున్నర కోడికాళ్ల (121 గ్రాముల బరువైన)ను గుటుక్కుమనిపించేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెల కొల్పింది.
డర్బన్‌లోని ఉమ్లాజీలో ఉన్న మాషమ్‌ప్లేన్స్ లాంజ్ రెస్టారెంట్ అండ్ బార్‌లో ఇటీవల జరిగిన ఈ పోటీలో ఆమె ఈ ఘనత సాధించింది. పోటీలో పాల్గొన్న ఐదుగురిలో ఒక యువతి కోడి కాలును నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పడంతో అక్కడ్నుంచి లేచి వెళ్లిపోగా సిమనైల్ మాత్రం ఎటువంటి తత్తరపాటుకు లోనుకాకుండా వాటిని ఆరగించేసింది. ఈ పోటీ స్టంబో రికార్డ్ బ్రేకర్స్ అనే చానల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది.
Comments
Please login to add a commentAdd a comment