ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 28వ తేదీన జాతీయ బీమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని విశ్వసిస్తూ ఐఆర్‌డీఏ మిషన్ ‘2047 నాటికి అందరికీ బీమా’కు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో బీమా వ్యాప్తిని పెంపొందించడానికి ఈ అవగాహన డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొబైల్ వ్యాన్‌లను ఏర్పాటు చేశామని, ఈ డ్రైవ్‌లో కమ్యూనిటీలకు అవగాహన కల్పించే సమాచార కరపత్రాలతో పాటు సెషన్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాల్లోని 250 గ్రామాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, మొత్తం 50 రోజుల పాటు సాగే అవగాహన కార్యక్రమాల్లో రాష్ట్రంలో కనీసం 1,25,000 మందిని కలవాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment