
RBI Update: రెండు వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించిన అధికారిక ప్రకటన 2023 మే 19న జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే చాలా వరకు రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో చేరుతున్నాయి. కాగా దీనికి సంబంధించి ఆర్‌బీఐ అప్డేట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పటి నుంచి జులై 31 వరకు సుమారు 88 శాతం రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం వీటి విలువ రూ. 3.14 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఇంకా బ్యాంకులకు చేరవలసిన మొత్తం రూ. 0.42 లక్షల కోట్లు అని సమాచారం.
ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!
రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిల్ లేదా ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి గడువు సెప్టెంబర్ 30 అని గతంలోనే వెల్లడైంది, కాగా ఈ గడువు మళ్ళీ పెరుగుతుందా? లేదా అనేదాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెలుగులోకి రాలేదు. కావున తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గడువు లోపల రెండు వేల నోట్లను డిపాజిట్ చేసుకోవాలి.