two thousand
-
ఓటుకు సిద్ధం.. 100 ఏళ్లు దాటిన 2,000 మంది ఓటర్లు!
ఛత్తీస్‌గఢ్‌లో నేడు (మంగళవారం) లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఒక కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనుండగా, వారిలో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. రాష్ట్రంలో మొదటి సారి ఓటు వేయబోయేవారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలు. రాష్ట్రంలోని సుర్గుజా, రాయ్‌గఢ్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్పూర్, దుర్గ్, రాయ్‌పూర్‌లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 26.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రింకింగ్ వాటర్, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. క్యూలో నిలుచునే ఓటర్లకు నీడను కల్పించారు. వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన మందులతో పాటు మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచారు.రాష్టంలోని ఏడు స్థానాలకు నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడో దశలో 26 మంది మహిళలతో సహా మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. రాయ్‌పూర్‌లో అత్యధికంగా 38 మంది, బిలాస్పూర్లో 37 మంది, కోర్బాలో 27 మంది, దుర్గ్‌లో 25 మంది, జాంజ్‌గిర్-చంపాలో 18 మంది, రాయ్‌గఢ్‌లో 13 మంది, సుర్గుజాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 25 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్‌గా, 1072 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్‌గా వర్గీకరించారు. -
97 శాతం వెనక్కి వచ్చిన రెండువేల నోట్లు.. మిగిలింది ఎన్ని కోట్లంటే?
ముంబై: చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మే 19వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 బ్యాంక్ నోట్లు చెలామణిలో ఉన్నాయి. అక్టోబర్ 31వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి ఈ విలువ రూ.10,000 కోట్లకు తగ్గింది’’ అని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రాంతీయ కార్యాలయాల్లో బారులు.. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎవరైనా ఈ కార్యాలయాలకు వెళ్లలేని పక్షంలో పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని ఆర్బీఐ సూచించింది. కాగా, రూ.2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ కోసం ఆర్బీఐ కార్యాలయాల వద్ద పని వేళల్లో పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. రెండువేల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. -
రూ. 2వేల నోట్లు తీసుకోవద్దు
తమిళనాడు: ప్రయాణికుల నుంచి రూ.2000 నోట్లు తీసుకోవద్దని రాష్ట్ర రవాణా సంస్థ అదేశించింది. నవంబర్ 8, 2016సంవత్సరంలో ప్రధాని మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేరోజు కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. తర్వాత 2019లో రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ పరిస్థితులో రాష్ట్ర రవాణా సంస్థ గురువారం నుంచి ప్రయాణికుల నుంచి రూ.2000 నోట్లను తీసుకోవద్దని ఆ శాఖ మేనేజర్లు, కండక్టర్లకు బుధవారం సమాచారం అందించింది. -
బ్యాంకులకు వెనక్కి వస్తున్న రూ.2 వేల నోట్లు.. బడా బాబులవే
సాక్షి, అమరావతి: క్లీన్ నోట్ పాలసీలో భాగంగా కేంద్రప్రభుత్వం రూ.2 వేల నోటును మే 19న చెలామణిలోంచి ఉపసంహరించింది. సెప్టెంబరు 30 లోగా ఆ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. దీంతో రూ.2 వేల నోట్లు ఉన్న వారందరూ వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, చిన్న నోట్లు తీసుకుంటున్నారు. ఇలా నోట్లను మార్చుకుంటున్న వారిలో అత్యధికులు బడా బాబులే. సామాన్యుల నుంచి వస్తున్న నోట్లు చాలా తక్కువని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, మరికొన్ని చిన్న బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్న నోట్లలో 90 శాతానికి పైగా వ్యాపారుల నుంచే వస్తున్నాయని వెల్లడించాయి. సిటీ యూనియన్ బ్యాంక్‌లో రూ.380 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు డిపాజిట్ అయితే.. అందులో 90 శాతంపైన వ్యాపారవేత్తలవేనని ఆ బ్యాంకు అధికారులు తెలిపారు. అదే పెద్ద బ్యాంకుల్లో వస్తున్న డిపాజిట్లలో 50 శాతం పైన ధనవంతులవే. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రూ.3,589 కోట్ల విలువైన నోట్లు వెనక్కి రాగా అందులో 40 శాతం పైన, యూకో బ్యాంకులో రూ.3,471 కోట్లు డిపాజిట్ అయితే అందులో 58 శాతం వ్యాపారవర్గాల నుంచే వచ్చినట్లు పేర్కొన్నారు. 2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు నగదు కొరత రాకుండా రూ.2 వేల నోటును కేంద్రం ప్రవేశపెట్టింది. కొన్ని సంవత్సరాలుగా రూ.2 వేల నోటు చెలామణి తగ్గడంతో వీటిని వెనక్కి తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతించింది. బ్యాంకులకు చేరిన నోట్లను తిరిగి వెనక్కి ఇవ్వవొద్దని బ్యాంకులను ఆదేశించింది. దేశంలో మొత్తం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉండేవి. వాటి ఉపసంహరణ అనంతరం జూలై 31 నాటికి 88 శాతం నోట్లు అంటే రూ.3.14 లక్షల కోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ.14,000 కోట్లు విలువైన నోట్లు వచ్చాయి. పెద్ద మొత్తంలో నోట్లు వెనక్కి రావడంతో బ్యాంకుల వద్ద డిపాజిట్ల విలువ భారీగా పెరిగిపోతోంది. దీంతో బ్యాంకుల వద్ద నగదు లభ్యతను తగ్గించడానికి ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐసీఆర్ఆర్)ను 10 శాతం కేటాయించాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకుల వద్ద ఒక్కసారిగా డిపాజిట్లు పెరిగిన సమయంలో తాత్కాలికంగా ఐసీఆర్ఆర్ను ఆర్బీఐ వినియోగిస్తుంది. -
ఆర్బీఐ అప్డేట్.. రూ. 2000 నోట్లు ఎన్ని కోట్లు వెనక్కి రావాలంటే?
RBI Update: రెండు వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించిన అధికారిక ప్రకటన 2023 మే 19న జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే చాలా వరకు రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో చేరుతున్నాయి. కాగా దీనికి సంబంధించి ఆర్బీఐ అప్డేట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పటి నుంచి జులై 31 వరకు సుమారు 88 శాతం రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం వీటి విలువ రూ. 3.14 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఇంకా బ్యాంకులకు చేరవలసిన మొత్తం రూ. 0.42 లక్షల కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి గడువు సెప్టెంబర్ 30 అని గతంలోనే వెల్లడైంది, కాగా ఈ గడువు మళ్ళీ పెరుగుతుందా? లేదా అనేదాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెలుగులోకి రాలేదు. కావున తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గడువు లోపల రెండు వేల నోట్లను డిపాజిట్ చేసుకోవాలి. -
డోంట్ వర్రీ నేటి నుంచి 2000 వేల నోట్ల మార్పిడి..!
-
2000 రూపాయల నోట్లను బ్యాంకు లో తీసుకోకపోతే ఇలా చేయండి
-
పెద్ద నోటు రద్దు... ఏ కట్టడికి?! అసలు కారణం ఇదేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఇంతకీ 2 వేల నోటు ఉపసంహరణ లేదా రద్దు ఎవరి కోసం? నల్లధనం కట్టడికా! రాజకీయ ప్రత్యర్థుల కట్టడికా! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల ఫలితం కంటిమీద కునుకు లేకుండా చేసినట్టుంది. డిసెంబరులో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా ఈ నోటు రద్దును ఎందుకు భావించకూడదు? ఎన్నికల్లో ధనప్రవాహం అభిలషణీయం కాదు కానీ, దాన్ని ఆపడం ఇప్పటివరకు ఎవరి వల్లా కాలేదు. ఇకపై కాదు కూడా! మొన్నటికి మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ సోదాల్లో 375 కోట్లకు పైగా (డబ్బు, మందు, కానుకలు) దొరికింది. దొరకనిది ఇంకెన్ని రెట్లుంటుందో! ఓటర్లకు ఎర వేయడం తప్పనప్పుడు, ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వకుండా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం యుద్ధనీతిలో భాగమే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సరిగ్గా ఇదే చేసింది. 2016లో నోట్ల రద్దును గొప్ప ప్రయోగంగా, ఆర్థిక వ్యవహారాల్లో గొప్ప మలుపుగా ప్రధానమంత్రి మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రకటించినప్పుడు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆ చర్య బడా బాబులతో పాటు సగటు జీవులకూ కొన్ని నెలల పాటు కునుకు లేకుండా చేసింది. చివరికి దానివల్ల ఏం ఒరిగింది? నల్లధనంగా భావించిన మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా మళ్లీ బ్యాంకుల్లోకి చేరిపోయింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ (ఆపరేషన్ విజయవంతం, కానీ రోగి దక్కలేదు)’ చందంగా తయారైంది. నోట్ల రద్దును అప్పుడు మోదీ ప్రకటిస్తే, శుక్రవారం నాడు మాత్రం 2 వేల నోటు రద్దును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బహుశా నోటు రద్దుకు రాజకీయ రంగు అంటకుండా కేంద్రం తీసుకున్న జాగ్రత్త ఇది. దేశ ఆర్థిక రంగాన్ని చిన్నదో పెద్దదో ఏదో ఒక కుదుపుకు లోను చేసే ఇలాంటి నిర్ణయాన్ని ఆర్బీఐ ప్రకటించడంలోనే అసలు అంతరార్థం అవగతమవుతుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ (యుద్ధంలోనూ ప్రేమలోనూ సర్వం సబబే)’ అన్న నానుడి తెలుసు కదా! ఇదే సూత్రాన్ని రాజకీయాలకు అన్వయిస్తే సరిపోతుందేమో! బీజం పడిందక్కడే...! రాజకీయ అవసరాలను పక్కన పెడితే ఈ పెద్ద నోటు రద్దు ఎవరికి నష్టం? రెండు వేల నోటు ముద్రణ నిలిపివేసి చాలా ఏళ్లవుతోంది. బ్యాంకులు కస్టమర్లకు వాటిని జారీ చేయడం నిలిపివేసి కూడా చాలా రోజులవుతోంది. చలామణిలో లేకపోవడంతో సగటు జీవులు ఈ నోటును కళ్లజూసి కొన్ని నెలలవుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో, సినిమా రంగంలో చలామణిలో ఉన్న మాట వాస్తవం. ఆర్బీఐ లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు మార్కెట్లో ఉన్నాయి. ఇందులో అధిక శాతం బడా బాబుల చేతుల్లోనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లకు 2 వేల రూపాయల నోట్లే పంచారన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుంది కాబట్టి ఆ నోటుపై వేటు వేస్తే ప్రతిపక్షాలను దెబ్బ తీయొచ్చనేది అసలు వ్యూహం. ప్రతిపక్షాల కూటమికి తనను సారథిని చేస్తే ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తానని ఓ నేత అన్నట్టు ఓ ప్రముఖ ఇంగ్లిష్ చానల్లో ఆ చానల్ తాలూకు ప్రముఖ జర్నలిస్టు బాహాటంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా రెండు వేల నోటుపై వేటుకు అక్కడే బీజం పడి ఉంటుంది. కాదంటారా!? -
ఎక్కడ..2 వేల నోట్లు ..?
-
ఇండియన్ కరెన్సీని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా!
డబ్బు.. గల్లీ నుంచి ప్రపంచ దేశాల వరకు ప్రతి ఒక్కరితో దీనితో అమితమైన సంబంధం ఉంటుంది. ఎన్ని చేతులు మారిన విలువ మారనిది డబ్బు ఒకటే. సంపాదిస్తే కానీ డబ్బు విలువ తెలీసిరాదంటారు. చాలామంది డబ్బు ద్వారానే విలువస్తుందని భావిస్తుంటారు. ఏ పని చేసినా దాని కోసమే. మనిషి జీవితాన్ని శాసించేది కూడా డబ్బే. డబ్బు సంపాదించడం కంటే దాన్ని పొదుపు చేయడం చాలా కష్టం. చూడటానికి కాగితం ముక్కే కావచ్చు కానీ ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎన్నో విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి.మరి అలాంటి డబ్బులను ప్రింట్ చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా.. ఒక సాధారణ కాగితానికి 10,100.. నుంచి 2000 రూపాయల విలువ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది. భారతీయ కరన్సీని ముద్రించడానికి అయ్యే ఖర్చు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ► 2018 నాటి డేటా ప్రకారం.. 10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►20 రూపాయల నోటును ముంద్రించడానికి 1 రూపాయి ఖర్చు అవుతుంది. అంటే దీనికి 10 రూపాయల నోటు కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ► 50 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►100 రూపాయల నోటును ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది. ►200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది. ►500 రూపాయల నోటును ముద్రించడానికి 2.57 పైసలు ఖర్చవుతుంది. ►2000 రపాయల నోటును ముద్రించడానికి 4.18 పైసలు ఖర్చు అవుతుంది. వీటితో పాటు ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల నోట్ల ఖర్చు కూడా చూసుకుంటే.. ►పాత 500 రూపాయల నోటును ముద్రించడానికి 3.09 పైసలు ఖర్చు అవుతుంది. అంటే కొత్త 500 రూపాయల కంటే 52పైసలు అధికం. ►పాత 1000 రూపాయల నోటును ముంద్రించడానికి 3.54 పైసలు ఖర్చు అవుతుంది. అంతే కొత్త 2000 రూపాయల కంటే 64 పైసలు తక్కువ. -
ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
కాకినాడ రూరల్: తమ వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు ఇస్తే రూ.90 లక్షలకు రూ.కోటి ఇస్తామని నమ్మబలికి ఛీటింగ్‌కు ప్రయత్నించిన ముఠాను బాధితుడి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సర్పవరం సీఐ గోవిందరాజు ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలోని గంగరాజునగర్ రోడ్డు నంబరు 7కు చెందిన చలగళ్ళ నాగప్రసాద్‌ను ఫోన్లో విశాఖపట్నానికి చెందిన నలుగురు, కాకినాడ కర్ణంగారి వీధికి చెందిన ఒకరు కలిపి చీటింగ్ చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఒక వీడియోలో రూ.2వేల నోట్లతో కూడిన అట్టపెట్టెలు భారీగా ఉన్నట్టు చూపించి, ఆ తరువాత ఫోన్ ద్వారా రూ.2వేల నోట్లు ఎక్కువగా ఉన్నాయని, రూ.500 నోట్లు తమకు కావాలని నమ్మబలికారు. ఇందుకుగాను రూ.90 లక్షల రూ.5 వందల నోట్లకు రూ.కోటి (2వేల నోట్లు) అందిస్తామని నమ్మించారు. సోమవారం సాయంత్రం నాగమల్లిజంక్షన్ వద్దకు రావాలని కోరడంతో అనుమానం వచ్చిన నాగప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన సమాచారం మేరకు మాటు వేసిన పోలీసులు విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన భమిడిపాటి వెంకట సుధాకర్, విశాఖపట్నం పెద్దజాలరిపేటకు చెందిన తాటికాయల రాజా రవిశేఖర్, విశాఖపట్నం మల్కాపురానికి చెందిన కామాక నరసింగరావు, విశాఖపట్నానికి చెందిన కోడి కొండబాబు, కాకినాడ కర్ణంగారి జంక్షన్‌కు చెందిన నిడదవోలు సూర్య సుబ్రహ్మశర్మలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్సై ఎం.నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. -
2,000 నోటు ముద్రణకు బ్రేక్
ముంబై: దేశంలో రూ. 2,000 నోట్లను 2019–20 ఆర్థిక సంవత్సరంలో అసలు ముద్రించనే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదిక తెలిపింది. గత కొద్ది సంవత్సరాలుగా అసలు ఈ నోట్ల సర్క్యులేషన్ కూడా తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ మోసాలు రెట్టింపు, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 ప్రభావం, వ్యవస్థలో డిమాండ్, దేశాభివృద్ధి వంటి కీలక అంశాలను 2019–20 వార్షిక నివేదిక చర్చించింది. ఆయా అంశాలను పరిశీలిస్తే... రూ. 500, రూ. 200 కరెన్సీ నోట్ల ప్రవాహం 2019 మార్చి చివరినాటికి చెలామణీలో ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్ల సంఖ్య 33,632 లక్షలు. 2019 మార్చి నాటికి ఈ సంఖ్య 32,910 లక్షలకు తగ్గింది. 2020 మార్చి నాటికి మరింతగా 27,398 లక్షలకు పడిపోయింది. 2020 మార్చి చివరినాటికి మొత్తం నోట్ల పరిమాణంలో రూ.2,000 నోట్లు 2.4 శాతంగా ఉంది. 2018 మార్చి ముగిసేనాటికి ఇది 3.3 శాతం ఉంటే, 2019 మార్చి నాటికి 3 శాతానికి దిగివచ్చింది. ఇక విలువలు చూస్తే, మొత్తం నోట్ల విలువలో వీటి వాటా 2018 మార్చి నాటికి 37.3 శాతం. 2019 మార్చి నాటికి 31.2 శాతానికి దిగివచ్చింది. 2020 మార్చి నాటికి మరింతగా 22.6 శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో రూ.500, రూ.200 నోట్ల కరెన్సీ నోట్ల చెలామణీ అటు విలువ పరంగా ఇటు సర్క్యులేషన్ పరంగా భారీగా పెరిగింది. బ్యాంక్ నోట్ల ఇండెంట్ కూడా గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 23.3 శాతం నుంచి 13.1 శాతానికి తగ్గింది. ఇక నకిలీ కరెన్సీ నోట్ల విషయానికి వస్తే, ఇలా గుర్తించిన మొత్తంలో 4.6 శాతాన్ని ఆర్బీఐ గుర్తించగా, 95.4 శాతాన్ని ఇతర బ్యాంకులు పసిగట్టాయి. గుర్తించిన మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2,96,695. 2018–19లో గుర్తించిన రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 21,847 అయితే 2019–20లో ఈ సంఖ్య 17,020కి తగ్గింది. నిగనిగలడే రూ.100 బ్యాంక్నోట్లను ట్రైల్ బేస్‌లో తీసుకురావడానికి పలు చొరవలు ప్రారంభమయ్యాయి. అయితే కోవిడ్–19, ఇతర కొన్ని కారణాలతో ముద్రణాప్రక్రియ నిలిచిపోయింది. మెరుగుపడుతున్న వడ్డీరేట్ల బదలాయింపు సరళతర ద్రవ్య పరపతి విధానంలో (ఎంపీసీ) భాగంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను 2019 ఫిబ్రవరి నుంచీ ఆర్బీఐ 250 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తమకు అందివచ్చిన ఈ ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించడం 2019–20లో మెరుగుపడింది. ప్రత్యేకించి ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో బదలాయింపుల ప్రక్రియ ఊపందుకుంది. 2019 అక్టోబర్ నుంచి జూన్ 2020 మధ్య బ్యాంకింగ్ గృహ రుణాలపై వడ్డీరేట్లు 104 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గాయి. వాహన రుణాలపై ఈ తగ్గింపు 102 బేసిస్ పాయింట్లు ఉంటే, వ్యక్తిగత రుణాల విషయంలో 115 బేసిస్ పాయింట్లు ఉంది. ఇక లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల విషయంలో 198 బేసిస్ పాయింట్ల రుణ రేటు తగ్గింది. మరింతగా వడ్డీరేట్ల తగ్గింపునకు తగిన చర్యలను ఆర్బీఐ తీసుకుంటుంది. తగిన తక్కువ వడ్డీరేట్లకు రుణాలు అందడం వల్ల పెట్టుబడులు, డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. 2018–19లో బ్యాంకింగ్ రుణ వృద్ధి రేటు 13.3 శాతం ఉంటే, 2019–20లో ఇది 6.1 శాతానికి తగ్గడం ఆందోళనకరం. ప్రస్తుత కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యం రుణ వృద్ధిరేటుపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో దాదాపు ఈ పరిస్థితి కనబడుతోంది. వ్యవస్థలో డిమాండ్, తద్వారా వృద్ధి పురోభివృద్ధికిగాను తగ్గిన రుణరేట్ల ప్రయోజనం కస్టమర్‌కు అందాలి. ఆహారోత్పత్తుల మిగులు నిర్వహణ సవాళ్లు ఆహారోత్పత్తుల మిగులు నిర్వహణ విషయంలో సవాళ్ల మధ్య ప్రస్తుతం భారత్ నిలబడింది. 2019–20లో భారత్ మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 296.65 మిలియన్ టన్నుల రికార్డు స్థాయికి చేరింది. ఇక ఉద్యానవన ఉత్పత్తులు ఆల్‌టైమ్ హై 320.48 మిలియన్ టన్నులకు ఎగసింది. పాలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు, పత్తి, చెరకు, మత్స్య, పౌల్ట్రీ వంటి రంగాల ఉత్పత్తి విషయంలో ముందు వరుసలో ఉన్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. అయితే ఆహార భద్రత, మిగులు నిర్వహణ విషయం లో భారత్ సవాళ్లను ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ 3నాటికి రూ.20 వేల కోట్లు వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగినంత ఉండడానికి ఆర్బీఐ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. సెప్టెంబర్ 3 నాటికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా నిర్వహించనున్న రెండు దశల బాండ్ల కొనుగోలు ప్రక్రియతో వ్యవస్థలోకి రూ.20,000 కోట్లను పంప్ చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆగస్టు 27న రూ.10,000 కోట్లకు బాండ్ల వేలం నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 3న మరో దశ వేల ప్రకటన ఉంటుంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు ఎటువంటి సమస్యా లేకుండా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయం... వాతావరణ మార్పులపై జాగ్రత్త మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శాతం వాటా కలిగిన భారత వ్యవసాయ రంగంపై వాతావరణ మార్పు ప్రభావం పడే ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. వర్షపాతంలో ఒడిదుడుకులు, ఉష్ణోగ్రత పెరగడం వంటి అంశాలు వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. కొన్ని ప్రతికూలతలు ఉన్నా గడచిన గడచిన ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం చేయూతను ఇచ్చింది. 2020లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 1901 నుంచి 2000 మధ్య భారత్‌లో వార్షిక సగటు ఉష్ణోగ్రత 0.5 సెల్సియస్ పెరిగితే, 1997–2019 మధ్య ఇది 1.8 సెల్సియస్‌కు చేరడం ఒకింత ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి పరిస్థితి కొనసాగితే, పంట దిగుబడులు, వ్యవసాయ ఆదాయాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఆయా పరిస్థితులను అధిగమించడానికి తగిన పటిష్ట చర్యలు అవసరం. పెరగనున్న ధరల స్పీడ్ ఆహారం, తయారీ వస్తువుల సరఫరాల్లో ఇబ్బందుల వల్ల వచ్చే కొద్ది నెలల కాలంలో ధరలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 2019–20 చివరి నెలల్లో పెరుగుతూ వచ్చిన ద్రవ్యోల్బణం 2020–21 తొలి ఆరు నెలల్లోనే నిర్దేశిత స్థాయిలను దాటింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులూ ఇందుకు కారణం. కూరగాయలు, పప్పు దినుసులు, చేపలు, మాంసం వంటి ఆహార ధరలు పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.93%కి పెరిగింది. పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4% (2 శాతం అటూఇటుగా) స్థాయిలో ఉండాలనేది ఆర్బీఐకి ప్రభుత్వ నిర్దేశం. జనవరి నుంచి ఎకానమీ వృద్ధిబాట! భారత్ ఆర్థిక వ్యవస్థలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయంపై కచ్చితమై నిర్ధారణకు రావడం కష్టం. లాక్డౌన్, వినియోగ డిమాండ్ పడిపోవడం, అంతర్జాతీయ అంశాలు వంటి పరిశీలించాల్సిన అపరిష్కృత అంశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జూన్ మధ్య ఆర్థిక వ్యవస్థ క్షీణతలోకి జారిపోతుందని భావిస్తున్నాం. డిసెంబర్ వరకూ రికవరీ దశ ఉండే వీలుంది. చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) నుంచి ఆర్థిక రంగం వృద్ధిబాటలోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రైవేటు వినియోగం ప్రస్తుతం పూర్తిగా పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యయాలు, ప్రత్యేకించి మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి అవసరం. ఆయా చర్యలు డిమాండ్ రికవరీకి ఊతం ఇస్తాయి. ఇక సుస్థిర వృద్ధి రేటుకు ప్రొడక్ట్ మార్కెట్లు, ఫైనాన్షియల్, కార్మిక రంగాల్లో విస్తృత శ్రేణి సంస్కరణలు తీసుకురావాలి. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టుతప్పకుండా తగిన చర్యలు ఉండాలి. బ్యాంకింగ్ మోసాలు రెట్టింపు బ్యాంకింగ్ మోసాలు రెట్టింపుకావడం తీవ్ర ఆందోళనకరమైన అంశం. 2018–19లో రూ.71,500 కోట్ల బ్యాంకింగ్ మోసాలు జరిగితే, అటు తర్వాత 2020 జూన్ నాటికి ఈ మొత్తం రూ.1.85 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. అటు వాసిలోనూ ఇటు రాసిలోనూ రెండింటిలో మోసాలు తీవ్రం అయ్యాయి. ఫ్రాడ్ కేసులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వార్షికంగా 234 శాతం పెరిగితే, ప్రైవేటు బ్యాంకుల్లో ఈ పరిమాణం 500 శాతంపైగా ఉండడం గమనార్హం. ‘‘ముందస్తు హెచ్చరికల సంకేతాలు’’ వ్యవస్థ బలహీనత, అంతర్గత ఆడిట్ల విషయంలో లోపాలు, ఫోరెన్సిక్ ఆడిట్ల సమయంలో అందని రుణ గ్రహీతల సహకారం, అసమగ్ర ఆడిట్ నివేదికలు, నిర్ణయాల విషయంలో బ్యాంకింగ్ మధ్య సమన్వయ లోపాలు, మోసాలను గుర్తించడంలో జరుగుతున్న ఆలస్యం’’ వంటి అంశాలు ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆయా లోపాల పట్ల బోర్డులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపేసిన ఆర్బీఐ
సాక్షి, హైదరాబాద్ : ఇకపై రూ. 2 వేల నోట్ల సంఖ్య మరింతగా తగ్గనుంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం... పెద్దనోటు ముద్రణకు ఫుల్స్టాప్ పెట్టింది. నాలుగేళ్ల క్రితం రూ. 1,000, పాత 500 నోట్లను రద్దు చేసి దాని స్థానంలో రూ. 2,000 నోటును ప్రవేశపెట్టిన ప్రభుత్వం క్రమంగా దాని ముద్రణను తగ్గిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2016–17లో ఏకంగా రూ. 354.29 కోట్ల రూ. 2 వేల నోట్లను ప్రింటింగ్ చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.. గతేడాది నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. నాలుగేళ్లు.. 7,071 కోట్ల నోట్లు... బ్లాక్‌మనీకి ముకుతాడు వేయాలని భావిస్తున్న కేంద్ర సర్కారు.. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే రూ. 2 వేల నోట్ల ముద్రణను తగ్గించి రూ. 500 నోట్లను మాత్రం భారీగా ముద్రిస్తోంది. 2016–17తో పోలిస్తే గత ఏడాది ఏకంగా రెట్టింపు స్థాయిలో రూ. 500 నోట్లను ప్రింటింగ్ చేసింది. నాలుగేళ్ల క్రితం 429.22 కోట్ల నోట్లను ముద్రించగా.. గడచిన ఆర్థిక సంవత్సరం 822.77 కోట్ల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. గత నాలుగేళ్లలో 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్బీఐ ముద్రించింది. ఇందులో రూ. 500 నోట్లు 2458 కోట్లు ఉండగా.. రూ. 2 వేల నోట్లు 370 కోట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్ల ప్రింటింగ్‌ను కూడా రిజర్వ్ బ్యాంక్ తక్కువ చేసింది. డిజిటల్ పేమేంట్లకు ప్రోత్సాహాకాలు ఇస్తున్నందున చిన్ననోట్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్న ఆర్బీఐ... వ్యయం తగ్గింపులో భాగంగా ఈ నోట్ల ముద్రణను కూడా క్రమేణా తగ్గిస్తోంది. నాణేలను అందుబాటులోకి తెచ్చినందున గత నాలుగేళ్ల నుంచి రూ. 1, 2, 5 నోట్లను ముద్రణను ఆపేసింది. రూ. 200 నోటు ముద్రణకే ఎక్కువ ఖర్చు కరెన్సీ ముద్రణలో రూ. 200 నోటుకే ఎక్కువ ఖర్చవుతోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ నోటుకే అధికంగా వ్యయం చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. రూ. 200 నోటు ప్రింటింగ్‌కు రూ. 2.15 చొప్పున వెచ్చించగా రూ. 500 నోటుకు రూ. 2.13, రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.34 ఖర్చు చేసింది. అలాగే రూ. 50 నోటుకు 82 పైసలు ఖర్చుకాగా, రూ. 20 నోటుకు దీనికంటే మూడు పైసలు అధికంగా (85 పైసలు) ముద్రణకు వెచ్చించింది. అతితక్కువగా రూ. 10 నోటు ప్రింటింగ్‌కు 75 పైసలు ఖర్చు చేసినట్లు తెలిపింది. గతేడాది రూ. 2 వేల నోటు ముద్రించినందున..ఈ సమాచారాన్ని ఆర్బీఐ ముద్రణ సంస్థ వెల్లడించలేదు. గత నాలుగేళ్లుగా ముద్రించిన నోట్ల సంఖ్య (కోట్లలో) సంవత్సరం రూ. 500 నోటు రూ. 2 వేల నోటు 2016–17 429.22 354.29 2017–18 578.10 11.15 2018–19 628.48 4.66 2019–20 822.77 – ============================== మొత్తం 2,458.57 370.1 -
ఆ నోటు తీసుకోవాలంటే జంకుతున్న జనం
ఆర్బీఐ ఆరా..? నకిలీ నోట్ల కలవరంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం నివేదిక పంపించాలని సత్తుపల్లి బ్యాంక్ అధికారులను ఆదేశించింది. దీంతో ఉలిక్కిపడిన బ్యాంక్ అధికారులు ఇటీవల పట్టుబడిన డంప్‌లోని రూ.2వేల నోట్లపై పోలీసులతో సంప్రదింపులు, విచారణ చేపట్టి నకిలీ నోటు కాదని..చిల్ర్డన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుమీద రూ.2వేల నోటును పోలినవి పట్టుబడ్డాయని తేల్చారు. నకిలీ నోట్లు కాదంటూ ఆర్బీఐకు నివేదిక పంపించినట్లు సమాచారం. సాక్షి, సత్తుపల్లి (ఖమ్మం) : ఇటీవల సత్తుపల్లిలో నకిలీ రూ.2వేల నోట్లు బయటపడడం, పాత రూ.500, రూ.1000నోట్ల కట్టల భారీ డంప్ వెలుగుచూడడంతో..నకిలీ నోట్ల చలామణిపై భయం నెలకొంది. సూత్రధారి మదార్ వ్యవహారం..ఈ డబ్బుల కట్టల తంతు తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో..నకిలీ, డమ్మీ నోట్లు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో వ్యాపారులు, జనం రూ.2వేల నోటు తీసుకోవాలంటే జంకుతున్నారు. బాబోయ్ రెండువేల నోటా..? ఒకవేళ నకిలీదైతే ఎట్లా? అని కొందరి గుండెలదురుతున్నాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించి, పలుమార్లు పరిశీలించిన తర్వాతే ఇవ్వమంటున్నారు. సత్తుపల్లిలో దొంగనోట్ల డంప్‌లో నకిలీ రూ.2వేలు..ఏకంగా రూ.7కోట్లు పట్టుబడడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సినిమా స్టైల్లో నోట్లను అద్దెలుగా పేర్చి , ఫ్లైవుడ్‌తో తయారు చేసిన డబ్బాలకు అతికించడంతో చూడటానికి పెద్ద డంప్లాగా కన్పించడంతో డబ్బులు కట్టలు.. కట్టలుగా పట్టుబడినట్లు ప్రజలు నమ్ముతున్నారు. ఒక్కసారిగా కోట్లాది రూపాయల రూ.2వేల నోట్లు పట్టుబడ్డాయని ప్రచారంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. దీనికి తోడు రద్దయిన రూ.1000, రూ.500నోట్లు లభించడం కూడా బ్యాంక్ అధికారులకు పని కలిపించినట్లయింది. రద్దయిన పాత నోట్ల వివరాలను సైతం బ్యాంక్ అధికారులకు పంపించినట్టు సమాచారం. దేశంలోనే తొలిసారిగా వేంసూరు మండలం మర్లపాడులో దొరికిన రద్దయిన పాతనోట్లు రూ.12,11,500లకు సంబంధించి స్పెసిఫైడ్ బ్యాంక్‌నోట్స్ యాక్టు(ఎస్బీఎన్) కింద కేసు నమోదు కావడం గమనార్హం. రద్దయిన పాతనోట్లు ఎవరి వద్దయినా ఉంచుకోవాలంటే కేవలం మచ్చుకు పది మాత్రమే ఉండాలని నిబంధన ఉంది. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ల రద్దు సమయంలో స్పష్టంగా ప్రకటించింది. తీసుకోవాలంటే ఆలోచించాల్సిందే.. రూ.2 వేల నోటు అంటేనే తీసుకోవడానికి వెనుకాముందు ఆడే పరిస్థితి నెలకొంది. ఒకటికి పదిసార్లు రూ.2వేల నోటును పరీక్షించి చూడటం..నమ్మదగిన వ్యక్తి అయితేనే తీసుకునేందుకు ముందుకు వస్తుండటంతో ప్రజల్లో అసహనం రేగుతోంది. అసలు నోటు.. దొంగనోటు.. నకిలీనోటు..డమ్మీనోటు వీటిపై ఉన్న వ్యత్యాసం ఏమిటోనంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అసలు నోటుకు పోలిన విధంగా ఉండే నోటును నకిలీనోటు, దొంగనోటుగా పిలుస్తుంటారు. డమ్మీనోటు అసలు నోటులాగే ఉంటూ పేపర్లో వ్యత్యాసం, రిజర్వ్‌బ్యాంక్ స్థానంలో ఏదో ఒక పేరు పెట్టి మోసాలకు పాల్పడుతుంటారు. ఇటీవల జిల్లాలో పలుచోట్ల నకిలీనోట్లు దర్శనమివ్వడం..బ్యాంకుల్లో గుర్తించి నోటుపై పెన్నుతో గీతలు కొట్టడం చేస్తున్నారు. దీంతో నకిలీ నోట్లు ఎంతో కొంత ఉన్నాయనే ప్రచారానికి బలం చేకూర్చుతుందని కొందరు వాదిస్తున్నారు. సత్తుపల్లి ప్రాంతంలో.. దొంగనోట్లు పెద్ద ఎత్తున సత్తుపల్లి ప్రాంతంలోనే పట్టుబడటంతో నిఘా వర్గాలు సైతం ఇంకా ఇలాంటి కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా అంటూ ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. సంఘ వ్యతిరేక కార్యాకలాపాలు చేపట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కదలికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మదార్ ముఠాతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలపై పూర్తి స్థాయిలో అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దొంగనోట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న నిందితులు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న వారెవరో అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పెద్ద నోటంటే భయపడుతున్నాం.. సత్తుపల్లిలో రూ.2వేల దొంగనోట్లు పట్టుబడ్డాయనే ప్రచారంతో నోట్లు తీసుకోవాలంటేనే జంకాల్సి వస్తోంది. మాలాంటి వాళ్లకు అసలు నోటు ఏమిటో..నకిలీ నోటు ఏమిటో అర్థం కాదు. అందుకనే రూ.2వేల నోటు తీసుకొస్తే ఇబ్బంది పడుతున్నాం. చిల్లర కూడా ఎవరూ ఇవ్వట్లేదు. – ఎండీ.ముబారక్ హుస్సేన్, రెడీమేడ్ వ్యాపారి, సత్తుపల్లి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది.. మాకు రోజుకు రెండు, మూడు రూ.2వేల నోట్లు వస్తానే ఉంటాయి. ఈ మధ్య కొద్దిగా ఇబ్బందిగానే ఉంటోంది. ఎవరైనా తెలిసిన వాళ్లు ఇస్తే వాళ్లకు చెప్పి మరీ పేరు రాసుకొని తీసుకోవాల్సి వస్తోంది. – కాకర్ల జగన్, రైస్షాపు, సత్తుపల్లి -
పెద్దనోటు అదృశ్యం
చిత్తూరు అగ్రికల్చర్: రెండు వేల నోటు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. పాత నోట్ల రద్దు తర్వాత కనిపించిన ఈ నోటు రానురానూ అదృశ్యమవుతోంది. బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసుకుంటే రూ. 100 నోట్లను మాత్రమే చేతికిస్తున్నారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు ఈ నోట్లనే తీసుకోవాల్సి వస్తోంది. పెద్ద నోట్లు ఇచ్చే పరిస్థితి బ్యాంకుల్లో ప్రస్తుతం లేదు. జిల్లాలో 39 బ్యాంకులకు చెందిన 618 బ్రాంచిలున్నాయి. రోజూ దాదాపు రూ. 30 కోట్ల మేరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటీఎంల ద్వారా మరో రూ. 10 కోట్లకు పైబడి ఖాతాదారులు తీసుకుంటున్నారు. ఏటీఎంల నుంచి తీసుకోవాలంటే పరిమితి పెట్టారు. దీంతో పెద్దమొత్తంలో నగదు కావాల్సిన ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిందే. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కువగా వంద నోట్లే ఇస్తున్నారు. కాకుంటే రూ.200 నోట్లు ఇస్తున్నారు. దీంతో వీటిని తీసుకువెళ్లడం సమస్యగా మారింది. నోట్ల కట్టల భద్రత విషయంలోనూ ఆందోళన చెందుతున్నారు. ఆర్బీ నుంచి రూ.2 వేల నోట్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలిసింది. రూ.500 నోట్లు కూడా రావడం తగ్గిపోయింది. కొద్దో గొప్పో ఉన్నా అవి ఏటీఎంల ద్వారా మాత్రమే పొందే వీలుంది. ముద్రణ నిలిపివేత పది నెలల క్రితమే రూ.2 వేల నోట్ల ముద్రణను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. రూ. 500 నోట్ల సరఫరాను కూడా పూర్తిగా తగ్గించినట్లు తెలిసింది. రూ.500 నోట్లు ఏటీఎంలకు పరిమితం చేసినట్లు చెబుతున్నారు. పాత నోట్ల రద్దు తర్వాత విడుదలైన రూ. 2 వేల నోట్లు నల్లకుబేరులకు వరంలా పరిణమించింది. విడుదలైన కొన్నాళ్లు మాత్రమే జనం చేతుల్లో చెలామణి అయింది. కొద్దికాలంలోనే పెద్దనోటు వాడకం తగ్గిపోయింది. సంపన్నవర్గాల చేతిలో ఇవి చిక్కుకున్నాయనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు నోట్ల కష్టాలు మళ్లీ దాపురించాయి. చిన్న మొత్తాలు తీసుకెళ్లాలన్నా ఇబ్బందే పెద్ద నోట్లు సరఫరా నిలిచిపోవడంతో చిన్న మొత్తాలను తీసుకెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. బ్యాంకులో రూ. 10 వేలు డ్రా చేసినా చేతికి చిన్ననోట్ల కట్టలు అందిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకుంటే ముందస్తుగా సంచులు తీసుకెళ్లాల్సి వస్తోంది. – గురునాథరెడ్డి, కృష్ణంపల్లె ఏటీఎంలో రూ.500 మాత్రమే వస్తున్నాయి రూ. 500 నోట్లు ఏటీఎంలలో మాత్రమే వస్తున్నాయి. బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుంటే కేవలం రూ. 100 నోట్లు మాత్రమే చేతికిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకున్నా రూ.2 వేల నోట్లు ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకులను నుంచి నగదు తీసుకురావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – కారేటి గోవిందరెడ్డి, పెనుమూరు ఉన్న 2వేల నోట్లే చెలామణి అవుతున్నాయి కొత్తగా ఆర్బీఐ నుంచి రూ. 2 వేల నోట్లు రావడం లేదు. ఉన్న నోట్లే చెలామణి అవుతున్నాయి. ప్రస్తుతం 500, 200, 100 రూపాయల నోట్లు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. – లక్ష్మీ నారాయణ, జోనల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్ -
ఓటుకు రెండు వేల రూపాయల నోటు!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని 12 రోజులు లేవు. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తనవైపు తిప్పుకునేందుకు ధనభలం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 27వ తేద నుంచి ఇప్పటి వరకు 136 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు మొత్తంలో 90 శాతం నోట్లు రెండువేల రూపాయలవే ఉన్నాయి. అంటే ఓటుకు నోటుకున్న డిమాండ్ రెండు వేల రూపాయలకు చేరుకుందని దీన్నిబట్టి తెలుస్తోంది. 2017లో తమిళనాడులోని రాధాకష్ణన్‌నగర్‌కు జరిగిన ఉప ఎన్నికలతో పోలిస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ సొమ్ము పెద్ద ఎక్కువ కాదని తెలుస్తోంది. తమిళనాడు నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలకు 86 కోట్ల రూపాయలను పంచారని తెలిసి ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికను కొంతకాలం వాయిదా వేసింది. అనంతరం డిసెంబర్లో నిర్వహించిన ఆ ఉప ఎన్నికల్లో డబ్బు కుప్పలు తెప్పలుగా చేతులు మారిందని తెల్సింది. నాటి ఎన్నికల్లో టీటీవి దినకరణ్ పాలకపక్ష అన్నా డిఎంకే, ప్రధాన ప్రతిపక్ష డిఎంకే అభ్యర్థులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దినకరణ్ రాధాకష్ణన్ నగర్‌ను సందర్శించినప్పుడు స్థానిక ప్రజలు 20 రూపాయల నోట్లను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం ఈ 20 రూపాయల నోట్లను తీసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని వారు ధ్వజమెత్తారు. నాయకులు సంతకాలు చేసిన 20 రూపాయల నోట్లిచ్చి ఎన్నికల అనంతరం విజయం సాధిస్తే రెండువేలో, నాలుగువేల రూపాయలో ఇస్తామని తమిళనాడులో చెప్పారు. అది సరికొత్త పోకడ. అభ్యర్థి విజయం సాధిస్తేనే తమకు డబ్బులు వస్తాయని ఆశించి ఓటర్లు ఓట్లేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా డబ్బులు పంచకూడదంటూ అక్కడి రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ గట్టిగా హెచ్చరిస్తూ వస్తోంది. కానీ సరైన యాంత్రాంగం లేకపోవడం వల్ల రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బులు పంచకుండా ఎన్నికల కమిషన్ నివారించలేకపోతోంది. రాజకీయ నాయకులు, జనం దష్టిలో ఓటుకు నోటు అనేది రోజు రోజుకు సాధారణ విషయంగా మారిపోతోంది. ఈ 12 రోజుల్లో కూడా కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగితే అది కచ్చితంగా బీజేపీకే లాభించే అవకాశం ఉంది. -
అటవీ శాఖలో 2 వేల పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖలో ఖాళీగా ఉన్న రెండు వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ఆ శాఖ మంత్రి జోగురామన్న వెల్లడించారు. అటవీ శాఖ పునర్విభజనలో భాగంగా 12 కొత్త సర్కిళ్లు ఏర్పాటు చేశామని.. 31 మంది జిల్లా అటవీ అధికారులు, 37 మంది ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. అలాగే 185 రేంజ్‌లు, 831 సెక్షన్లు, 3,132 బీట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం అరణ్యభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకు ముందు టెరిటోరియల్, సామాజిక వన విభాగం, లాగింగ్, వన్యప్రాణి విభాగం బీట్ నుంచి సర్కిల్ వరకు అన్ని విభాగాలు విడివిడిగా ఉండేవని, ప్రస్తుతం అన్నీ కలసి పనిచేస్తాయన్నారు. అటవీ పరిధిని డివిజన్లకు 961 చ.కి.మీ. నుంచి 727 చ.కి.మీ., రేంజ్‌ను 254 చ.కి.మీ. నుంచి 145 చ.కి.మీ., సెక్షన్‌ను 57 చ.కి.మీ. నుంచి 32 చ.కి.మీ.కు తగ్గించినట్లు తెలియజేశారు. బీట్ పరిధిని తగ్గించడం అటవీ పరిరక్షణకు ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో తొలిసారిగా జిల్లా అటవీ అధికారులను రాష్ట్రంలోనే నియమించినట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఏడాది చేపట్టనున్న హరితహారం కింద క్షీణించిన అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందుకోసం వచ్చేనెల నుంచే మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సమీక్షలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, పీసీసీఎఫ్ పీకే ఝా, బయో డైవర్సిటీ చైర్మన్ ఏకే శ్రీవాస్తవ, ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్, హరితహారం ఇన్చార్జి డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు.