ఛత్తీస్‌గఢ్‌లో నేడు (మంగళవారం) లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఒక కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనుండగా, వారిలో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. రాష్ట్రంలో మొదటి సారి ఓటు వేయబోయేవారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలు. రాష్ట్రంలోని సుర్గుజా, రాయ్‌గఢ్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్‌పూర్, దుర్గ్, రాయ్‌పూర్‌లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 26.
పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రింకింగ్ వాటర్, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. క్యూలో నిలుచునే ఓటర్లకు నీడను కల్పించారు. వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన మందులతో పాటు మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచారు.
రాష్టంలోని ఏడు స్థానాలకు నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడో దశలో 26 మంది మహిళలతో సహా మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. రాయ్‌పూర్‌లో అత్యధికంగా 38 మంది, బిలాస్‌పూర్‌లో 37 మంది, కోర్బాలో 27 మంది, దుర్గ్‌లో 25 మంది, జాంజ్‌గిర్-చంపాలో 18 మంది, రాయ్‌గఢ్‌లో 13 మంది, సుర్గుజాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 25 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్‌గా, 1072 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్‌గా వర్గీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment