
న్యూఢిల్లీ: నల్ల ధనాన్ని అరికట్టే చర్యలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయిరెడ్డి తెలిపారు. రూ.2000 నోట్లను రద్దు ద్వారా బ్లాక్ మనీ అరికట్టే క్రమంలో ఆర్‌బీఐ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా 2016లో నవంబరులో చలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్ల రద్దు చేసిన తరువాత రూ.2వేల కరెన్సీ నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.