టీడీపీ విషప్రచారం.. తిప్పికొట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి | YSRCP MP Vijayasai Reddy Counter To Kanakamedala Ravindra Kumar Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో టీడీపీ విషప్రచారం.. తిప్పికొట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి

Published Mon, Feb 7 2022 1:44 PM | Last Updated on Mon, Feb 7 2022 7:23 PM

YSRCP MP Vijayasai Reddy Counter To Kanakamedala Ravindra Kumar Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ విషప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి బలంగా తిప్పికొట్టారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అవాస్తవాలను వల్లేవేశారు.

సినిమా టికెట్లు సహా పలు అంశాలపై తప్పుడు ప్రచారం చేయడానికి కనకమేడల ప్రయత్నించారు. దీనిపై స్పందించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుండా టీడీపీ పాలన కంటే వైఎస్సార్‌సీపీ పాలన వెయ్యిరెట్లు గొప్పగా ఉందని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా అంశంపై..
ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబర్చడం సరికాదని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్‌ఆర్‌సీపీపై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి.. 7 సార్లు ప్రధాని మోదీని, 12 సార్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement