ఇంకా మూలుగుతున్న రూ.రెండువేల నోట్లు | RBI announced 97.96% of the Rs 2000 notes returned only Rs 7,261 crore still with the public | Sakshi
Sakshi News home page

ఇంకా వ్యవస్థలో మూలుగుతున్న రూ.రెండువేల నోట్లు

Published Tue, Sep 3 2024 11:24 AM | Last Updated on Tue, Sep 3 2024 1:17 PM

RBI announced 97.96% of the Rs 2000 notes returned only Rs 7,261 crore still with the public

రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక అప్‌డేట్‌ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్‌బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.7,261 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.

మే 19, 2023న ఆర్‌బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్‌ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 ఆగస్టు 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.7,261 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..

ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్‌బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement