దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏది జరిగినా ఇతర రంగాలపై ప్రభావం పడుతుందేమో గానీ బంగారం అమ్మకాలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపదన్న సంగతి తెలిసిందే. ఇటీవల రూ.2000 నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన తర్వాత మరోసారి ఈ విషయం నిరూపితమైంది. తమ దగ్గర ఉన్న నోట్లను చెల్లుబాటు కోసం ప్రజలు బంగారం దుకాణాలకు క్యూలు కడుతున్నారట. అంతేకాకుండా కొందరు ఫోన్ చేసి ఎంత వరకు కొనుగోలు చేయచ్చు తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం.
బంగారానికి భారీ డిమాండ్
ప్రస్తుత రెండు వేల నోట్లు సెప్టంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలో నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజలపై ఆ ప్రభావం తీవ్రంగా చూపింది. అయితే ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు రద్దు విషయంలో అంత ప్రభావం చూపకపోవచ్చు అనే ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
దీనికి ప్రధాన కారణం మార్కెట్ ఈ నోట్ల చలమాణి శాతం తక్కువగా ఉండడమే. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా జనం ఈ నోట్లను ఖర్చుపెట్టడమో లేదా బ్యాంకుల్లో మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే బ్యాంకులకు సెలవు దినాలు, కేవైసీ తదితరల కారణాల వల్ల మరో దారిపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నగల షాపులకు వెళ్లి రెండు వేల రూపాయల నోట్ల చలామణికి ప్రయత్నిస్తున్నారట.
దీంతో పాటు ఎంతమేరకు నగదుతో కొనుగోలు చేయొచ్చు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు నగరాలలో ఇతర సాధారణ వారాంతాల్లో కంటే శనివారం ఒక్కరోజే 50% ఎక్కువ ఫుట్‌ఫాల్‌ను చూసినట్లు సమాచారం. గతంలో 500 రూపాయల నోట్లు రద్దు చేసిన సమయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ప్రజలు అదే దారిని ఎంచుకున్నారని అంటున్నారు బంగారం షాపు యజమానులు. అయితే పెద్ద మొత్తంలో 2వేల రూపాయల నోట్లు ఉన్నవారు మాత్రం వాటిని బంగారంగా మార్చడానికే ఇష్టపడుతున్నారట.
చదవండి: సిద్ధరామయ్య హయాంలో రూ.2,42,000 కోట్ల అప్పులు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్
Comments
Please login to add a commentAdd a comment