jewellery sales
-
రూ. 2వేల నోట్ల రద్దు.. వాటికి బీభత్సమైన డిమాండ్, ఒక్కరోజులోనే!
దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏది జరిగినా ఇతర రంగాలపై ప్రభావం పడుతుందేమో గానీ బంగారం అమ్మకాలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపదన్న సంగతి తెలిసిందే. ఇటీవల రూ.2000 నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన తర్వాత మరోసారి ఈ విషయం నిరూపితమైంది. తమ దగ్గర ఉన్న నోట్లను చెల్లుబాటు కోసం ప్రజలు బంగారం దుకాణాలకు క్యూలు కడుతున్నారట. అంతేకాకుండా కొందరు ఫోన్ చేసి ఎంత వరకు కొనుగోలు చేయచ్చు తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. బంగారానికి భారీ డిమాండ్ ప్రస్తుత రెండు వేల నోట్లు సెప్టంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలో నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజలపై ఆ ప్రభావం తీవ్రంగా చూపింది. అయితే ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు రద్దు విషయంలో అంత ప్రభావం చూపకపోవచ్చు అనే ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం మార్కెట్ ఈ నోట్ల చలమాణి శాతం తక్కువగా ఉండడమే. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా జనం ఈ నోట్లను ఖర్చుపెట్టడమో లేదా బ్యాంకుల్లో మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే బ్యాంకులకు సెలవు దినాలు, కేవైసీ తదితరల కారణాల వల్ల మరో దారిపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నగల షాపులకు వెళ్లి రెండు వేల రూపాయల నోట్ల చలామణికి ప్రయత్నిస్తున్నారట. దీంతో పాటు ఎంతమేరకు నగదుతో కొనుగోలు చేయొచ్చు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు నగరాలలో ఇతర సాధారణ వారాంతాల్లో కంటే శనివారం ఒక్కరోజే 50% ఎక్కువ ఫుట్‌ఫాల్‌ను చూసినట్లు సమాచారం. గతంలో 500 రూపాయల నోట్లు రద్దు చేసిన సమయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ప్రజలు అదే దారిని ఎంచుకున్నారని అంటున్నారు బంగారం షాపు యజమానులు. అయితే పెద్ద మొత్తంలో 2వేల రూపాయల నోట్లు ఉన్నవారు మాత్రం వాటిని బంగారంగా మార్చడానికే ఇష్టపడుతున్నారట. చదవండి: సిద్ధరామయ్య హయాంలో రూ.2,42,000 కోట్ల అప్పులు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్ -
అక్రమ జువెల్లరీ అమ్మకాలకు జీఎస్టీ ఊతం
ముంబై : బంగారం అమ్మకాలపై పన్ను రేట్ల పెంపుపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ రేట్ల పెంపుతో అక్రమ ఆభరణాల అమ్మకానికి ఎక్కువగా దారితీసే అవకాశముందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బంగారంపై జీఎస్టీ పన్ను రేట్లు కూడా అంతకముందు కంటే పెరిగాయి. ముందస్తు 1.2 శాతంగా ఉన్న బంగారంపై పన్ను రేట్లు, ప్రస్తుతం 3 శాతానికి ఎగిశాయి. దీంతో బ్లాక్ మార్కెట్ ఎక్కువగా విజృంభించే అవకాశముందని తెలుస్తోంది. '' మూడు శాతం పన్ను చాలా ఎక్కువ. ఎలాంటి రశీదులు లేకుండా కొనుగోలుకు మేము సిద్ధం. జువెల్లర్కు ఎలాంటి సమస్య ఉండదు'' అని ఓ కొనుగోలదారుడు తన అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశంలో అతిపెద్ద బులియన్ మార్కెట్ ముంబైలోని జవేరి బజార్‌కు చెందిన ఈ కొనుగోలుదారుడు పేరు చెప్పడానికి నిరాకరించాడు. పన్ను రేట్లు పెరగడంతో చాలా దుకాణాలు రశీదులు లేకుండా విక్రయాలు చేపడతాయని జేజే గోల్డ్ హౌజ్ ప్రొప్రైటర్ హర్షద్ అజ్మేరి కూడా చెప్పారు. కేవలం 1 శాతం కొనుగోలుకే కొంతమంది కస్టమర్లు రశీదులు లేకుండా కొనుగోళ్లు చేపట్టేవారు, కానీ ప్రస్తుతం 3 శాతం జీఎస్టీతో చిన్న జువెల్లరీలు కచ్చితంగా అనధికారిక విక్రయాలు చేపడతారని అజ్మేరీ పేర్కొన్నారు. ఈ పన్ను రేట్లు పెంపు గోల్డ్ స్మగ్లింగ్‌కు ఎక్కువగా దారితీస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో అతిపెద్ద బంగారం వినియోగదారునిగా ఉంది. మెటల్స్‌పై దిగుమతి సుంకాలను 10 శాతానికి పెంచినప్పటి నుంచి గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా పెరిగింది. 2016లో 120 టన్నులకు పైగా బంగారం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా భారత్‌లోకి ప్రవేశించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనావేసింది. ఇది ఇప్పుడు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్మగ్లింగ్ చేసే బంగారానికి జీఎస్టీ ప్రోత్సాహకంగా ఉందని, ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించి, స్మగ్లింగ్‌కు అవకాశం లేకుండా చేయాలని ముంబైకు చెందిన ఓ జువెల్లరీ సూచించారు. తక్కువ దిగుమతి సుంకం, అధికారిక దిగుమతులను ప్రోత్సహించి, చట్టపరమైన విక్రయాలకు దోహదం చేస్తుందని హోల్‌సేలర్ ఎంఎన్సీ బులియన్ డైరెక్టర్ దమన్ ప్రకాశ్ రాథోడ్ కూడా చెప్పారు. ఏడాదిలో అధికారికంగా జరిగే దిగుమతులు 800 టన్నులుంటున్నాయి. -
జైట్లీ బడ్జెట్ జువెలరీ ఇండస్ట్రీకి నచ్చలేదా?
ముంబై : బడ్జెట్లో అన్ని రంగాలను అంతో ఇంతో పట్టించుకుంటూ వచ్చిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ జువెలరీని పూర్తిగా విస్మరించారు. కనీసం వారి డిమాండ్లు పట్టించుపోగా, ఆభరణ వర్తకులకు మరింత దెబ్బకొట్టేలా నగదు లావాదేవీలపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జెమ్స్, జువెలరీ ఇండస్ట్రి పెదవి విరుస్తోంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని అధిక స్థాయిలో ఉన్న 10 శాతం నుంచి తగ్గించాలని ఎన్నో రోజులుగా ఇండస్ట్రి అడుగుతున్న ప్రతిపాదనను జైట్లీ కనీసం పట్టించుకోనే లేదు. మరోవైపు రూ.3,00,000 మించి నగదు లావాదేవీలను అనుమతించబోమని అరుణ్ జైట్లీ తీసుకున్న నిర్ణయం గ్రామీణ ఆభరణ వ్యాపారాలకు మరింత దెబ్బకొడుతుందని వర్తకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముందు వరకు నగదు లావాదేవీలపై ఎలాంటి నిబంధనలు లేవు. కానీ రూ.5,00,000 కంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగితే మూలం వద్ద పన్ను వసూళ్లు పేరుమీద 1 శాతం చార్జీని వసూలు చేసేవారు. కానీ ప్రస్తుత బడ్జెట్ లో రూ.3,00,000 కంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలను అనుమతించబోమనే జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని జువెలరీ విక్రయాలపై తీవ్ర ప్రభావం పడనుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) సభ్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు చెక్‌ల సౌకర్యం, డిజిటల్ కంప్లైంట్ లేవని పేర్కొంటున్నారు. ఆభరణాల విక్రయాలకు గ్రామీణ ప్రాంత విక్రయాలే మంచి లాభాలను చేకూరుస్తున్నాయన్నారు. -
పాన్ నెంబర్ తీసుకోవడంలో రాజీ వద్దు: రెవెన్యూ