సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా జోష్ నెలకొంది. సింగరేణి లాభాల వాటాను కార్మికుల ఖాతాలో జమ చేసేందుకు అడ్డంకి తొలగింది. పండుగకు మూడు రోజుల ముందే కార్మిక ఖాతాల్లో సింగరేణి యాజమాన్యం నగదు జమ చేయనుంది. ఒక్కొక్కరికి రూ. 1.53 లక్షల చొప్పున 42 వేల మంది కార్మికులకు లాభాల వాటాను జమ చేయనుంది. ఈ మేరకు దసరా బోనస్‌గా రూ. 711 కోట్లు విడుదల చేసింది.
శనివారం దసరా పండగ అడ్వాన్స్ కూడా సింగరేణి సంస్థ చెల్లించనుంది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ గతేడాది సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు ముందే చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్ అందనున్నట్లు ఆయన చెప్పారు.
చదవండి: Video: చెక్‌పోస్టు కారు బీభత్సం.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టి..
Comments
Please login to add a commentAdd a comment