dasara bonus
-
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక విడుదల
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచి్చన ప్రకారం దసరా పండుగ ముందు ఒక డీఏను శనివారం విడుదల చేయనుంది. ఈ మేరకు డీఏ 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిల హర్షం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని శుక్రవారం ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి వేర్వేరుగా కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సాయంత్రానికి డీఏ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. డీఏ విడుదల చేయాలని నిర్ణయించినందుకు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు, సీఎస్ జవహర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. -
సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కొక్కరికి ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా జోష్ నెలకొంది. సింగరేణి లాభాల వాటాను కార్మికుల ఖాతాలో జమ చేసేందుకు అడ్డంకి తొలగింది. పండుగకు మూడు రోజుల ముందే కార్మిక ఖాతాల్లో సింగరేణి యాజమాన్యం నగదు జమ చేయనుంది. ఒక్కొక్కరికి రూ. 1.53 లక్షల చొప్పున 42 వేల మంది కార్మికులకు లాభాల వాటాను జమ చేయనుంది. ఈ మేరకు దసరా బోనస్‌గా రూ. 711 కోట్లు విడుదల చేసింది. శనివారం దసరా పండగ అడ్వాన్స్ కూడా సింగరేణి సంస్థ చెల్లించనుంది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ గతేడాది సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు ముందే చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్ అందనున్నట్లు ఆయన చెప్పారు. చదవండి: Video: చెక్‌పోస్టు కారు బీభత్సం.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టి.. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక
-
దసరా కానుక: ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్ సొమ్మును ఈ నెల 11న చెల్లించనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కింద రూ.79.07 కోట్లను కార్మికులకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఇటీవల ప్రకటించిన దీపావళి బోనస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ బోనస్)ను నవంబర్ 1న కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకోసం సంస్థ రూ.300 కోట్లను వెచ్చిస్తోందని, ప్రతి కార్మికుడు రూ.72,500 అందుకోనున్నాడని వివరించారు. ఇక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేల చొప్పున సంస్థ ప్రకటించిందని, ఈ డబ్బును ఈ నెల 8వ తేదీన చెల్లించనుందని పేర్కొన్నారు. పై రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి కార్మికులు సగటున రూ.1.15 లక్షల వరకు రానున్న మూడు వారాల్లో అందుకోనున్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని దుబారా చేయకుండా వినియోగించుకోవాలని, పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో మరింతంగా ఉత్సాహంగా, కలిసికట్టుగా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, తద్వారా ఈ ఏడాది మరింత మెరుగైన బోనస్‌లు, సంక్షేమం అందుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చదవండి: సాగర్‌ను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు -
కేంద్ర ఉద్యోగులకు బోనస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా సందర్భంగా బోనస్ ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల బోనస్‌ను అందజేయాలన్న ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019–2020 సంవత్సరానికి గానూ ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ (ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్– పీఎల్బీ), ఉత్పాదకతకు సంబంధం లేని బోనస్ (నాన్ పీఎల్బీ లేదా అడ్హాక్) ఇవ్వాలని నిర్ణయించినట్లు∙సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఈ బోనస్ వల్ల దసరా, దీపావళి ఉత్సవాల సందర్భంగా ఉద్యోగుల కొనుగోళ్లు పెరిగి, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ‘ప్రతీ సంవత్సరం దసరా సమయంలో ఉద్యోగులకు గత సంవత్సర ఉత్పాదకత ఆధారంగా బోనస్ ప్రకటించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా పీఎల్బీ, అడ్హాక్ బోనస్‌ను తక్షణమే అందించనున్నాం’ అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే, పోస్ట్స్, డిఫెన్స్, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, తదితర విభాగాలకు చెందిన సుమారు 16.97 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 2,791 కోట్లతో 2019–20 సంవత్సరానికి గానూ పీఎల్బీ అందించనున్నారు. సుమారు 13.70 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 946 కోట్లతో అడ్హాక్ బోనస్‌ను ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్‌లో నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా 12 లక్షల టన్నుల యాపిల్‌ను సేకరించే పథకాన్ని 2020–21 సీజన్లో కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు నాఫెడ్ వద్ద ప్రభుత్వ హామీగా ఉన్న రూ. 2500 కోట్లను వినియోగించేందుకు అనుమతించింది. కశ్మీర్లో పంచాయతీరాజ్ చట్టం– 1989 అమలు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మూడంచెల పంచాయతీరాజ్ విధానం కశ్మీర్‌లోనూ అమలు కానుంది. -
సింగరేణి బోనస్‌పై జలగం హర్షం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ గా రూ.25 వేలు ప్రకటిం చడంపై కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతేడాది రూ.18 వేలుగా ఉన్న ఈ బోనస్‌ను రూ.7వేలు పెంచి ఈ సారి రూ.25 వేలుగా ఇవ్వాలని సీఎం నిర్ణయించారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంకు కార్మికులపై ఉన్న ప్రేమాభిమానాలకు ఇది నిదర్శమని.. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జలగం వెల్లడించారు. -
రైల్వే కార్మికులకు 78 రోజుల వేతనం బోనస్
గుంతకల్లు: రైల్వే కార్మికులకు తీపి కబురు అందింది. ఈ నెలలో దసరా, వచ్చే నెల దీపావళి పండుగలు జరగనున్న నేపథ్యంలో రైల్వేలో పనిచేసే కార్మికులకు 78 రోజుల వేతనం (వేజ్స్)ను బోనస్‌గా ఇవ్వాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. గుంతకల్లు రైల్వే డివిజన్ మొత్తం మీద దాదాపు 13500 మంది ౖపైగా రెల్వే కార్మికులు, ఉద్యోగులకు బోనస్ లభిస్తుందని తెలిసింది. ఒక్కో కార్మికుడికి నెలకు గరిష్టంగా రూ.8,975లు వేజేస్ లభిస్తే ఒక్క రోజుకు రూ.299.16లు వంతున లభిస్తుందని నిర్ధారించారు. ఈ లెక్కన రైల్వే బోర్డు ఆదేశాల మేరకు 78 రోజుల వేతనం బోనస్‌గా ఇవ్వాలంటే ఒక్కో కార్మికుడికి రూ.17950లు వస్తుంది. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలతో పాటు నెల్లూరు, మహబూబ్‌నగర్, రాయచూరు, బళ్లారి జిల్లాలలో పనిచేసే 13500 మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులకు రూ.24 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంటుందని ఒక రైల్వే అధికారి తెలిపారు. -
ఆర్టీసీ కార్మికులకు దసరా బోనస్ ఇవ్వాలి